
విడుదల : 5- 6- 2015
దర్శకత్వం : కృష్ణ విజయ్ నిర్మాతలు : శ్యాం దేవభక్తుని, కృష్ణ విజయ్
కేమెర : విశ్వేశ్వర్
సంగీతం : సాయి కార్తీక్
ఎడిటింగ్ : దేవేంద్ర కాకరాల
సమర్పణ : నారా రోహిత్
రేటింగ్ : 2/ 5
నటీనటులు: నారా రోహిత్, ప్రియా బెనర్జీ, రవివర్మ తదితరులు
బాణం చిత్రం తో హీరోగా పరిచయం అయినా కుడా సోలో సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు నారా రోహిత్. వరుసగా విబిన్నమైన సినిమాల్లో నటిస్తున్నప్పటికీ కెరీర్ పరంగా ఎ సినిమా సరైన హిట్ అందివ్వలేక పోయింది. ఇప్పుడు అసురగా మరో సారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నార రోహిత్ హీరోగానే కాకుండా నిర్మాతగా ఎంట్రీ ఇస్తూ రుపొందిన్చిన చిత్రమిది. కృష్ణ విజయ దర్శకత్వం లో ప్రియ బెనర్జీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అసురగా ఎలా ఆకట్టుకున్నాడో చూద్దామా ..!
కథ:రాజమండ్రి సెంట్రల్ జైలు లో జైలర్ గా పనిచేస్తుంటాడు ధర్మతేజ ( నారా రోహిత్ ) యినిఫాం లో ఉంటె రాక్షసుడిగా పేరు తెచ్చుకుంటాడు. అన్యాయాన్ని ఎదిరించి ధర్మాన్ని గెలిపించాలనే లక్ష్యం తో ఉంటాడు. దానికోసం ఎంతదూరం అయిన వెళ్ళే రకం. అలంటి ధర్మ కు జైలు లో ఓ పెద్ద సమస్య ఎదురైంది. అతడే కరుడుగట్టిన హంతకుడు చంద్రశేఖర్ ( రవి వర్మ ) తన రెండో భార్య కుటుంబం ఆస్తిలో వాటాకోసం కోర్టుకు ఎక్కడం తో తట్టుకోలేని చంద్ర తల్లిని తప్ప ఆ కుటుంబం లోని అందరిని చంపేస్తాడు. దాంతో అతనికి కోర్ల్టు ఉరి శిక్ష విదిస్తుంది. దానికి సమయం దగ్గరపడుతున్న కొద్ది తాను ఎవడు చంపడు . నేను కచ్చితంగా బతుకుతాను అంటూ ధర్మ దగ్గర శపదం చేస్తాడు. తన ప్రాణం కన్నా ఏదీ ముఖ్యం కాదని భావించే ఛార్లి అదే జైలులో శిక్ష అనుభవిస్తున్న పాండు అనే మరో ఖైదీకి తన ఇన్‌ఫ్లుయెన్స్‌తో బెయిల్ ఇప్పిస్తాడు. ‘జైలు నుంచి బయటకు వెళ్ళి నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు నేను చనిపోకూడదు’ అని పాండుకు 50 కోట్ల విలువైన వజ్రాలు ఇస్తానని చెప్తాడు. బయటకు వెళ్ళిన పాండు. ముత్యం అనే రౌడీని కలిసి విషయం అంతా చెప్తాడు. శిక్ష నుంచి తప్పించుకోవడానికి చార్లి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? పాండు, ముత్యం చార్లికి ఏవిధంగా సాయపడ్డారు? జైలర్ ధర్మ ఆ ఉరిశిక్షను అమలు చేయగలిగాడా? అనేది తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.
నటీనటుల ప్రతిభ :ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది హీరో నారా రోహిత్ గురించి. న్యాయాన్ని గెలిపించడానికి దేనికైనా సిద్దపడే పాత్రలో బాగానే నటించాడు. అయితే అతని వయసుకు దగ్గ పాత్ర ఇది కాదనే అభిప్రాయం కుడా ప్రేక్షకుల్లో కలిగింది. అయితే వున్నంతలో తన క్యారెక్టర్‌కి న్యాయం చేశాడు. కొన్ని సీన్స్‌లో అతను చెప్పిన డైలాగ్స్ బాగున్నాయి. హీరోయిన్ ప్రియా బెనర్జీ బాగానే చేసింది. ఆకట్టుకునే అందం, అభినయం లేకపోయినా తన క్యారెక్టర్‌కి వున్న పరిధి మేరకు ఓకే అనిపించింది. ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన పాటలు బాగున్నాయి. చార్లిగా నటించిన రవివర్మకు ఇలాంటి క్యారెక్టర్ చెయ్యడం కొత్తేం కాదు. అయినా అతని క్యారెక్టర్ నుంచి ఇంకా ఏదో వస్తుందని ఆశించిన ప్రేక్షకుడికి నిరాశే మిగిలింది. ముత్యంగా నటించిన మధు సింగంపల్లి తన క్యారెక్టర్‌కి న్యాయం చేశాడు. మిగతా క్యారెక్టర్లలో పెద్దగా చెప్పుకునే వారెవరు లేకపోవడం విశేషం.
టెక్నికల్ హైలెట్స్ :ఇక్కడ ముందుగా చెప్పుకోవాల్సింది సంగీత దర్శకుడు సాయి కార్తీక్ గురించి. పాటల్లో, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో మంచి ఎఫర్ట్ పెట్టి వర్క్ చేసాడు. సినిమాలో వున్న పాటలు తక్కువే అయినప్పటికీ ఆడియో పరంగా బాగానే వున్నాయి. విజువల్‌గా కూడా ఓకే. సినిమా కు బ్యాక్‌గ్రౌండ్ స్కోరే ప్రాణం అని చెప్పాలి. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ విశ్వేశ్వర్ మంచి లైటింగ్‌తో అన్ని సీన్స్‌ని బాగానే తీశాడు. ముఖ్యంగా టైటిల్ సాంగ్ చాలా బాగుంది. ఇక ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ బాగానే వుంది. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే తను అనుకున్న కథను సినిమాటిక్‌గా చెయ్యడంలో సక్సెస్ అవ్వలేదని చెప్పాలి. నేరేషన్ స్లోగా వుండడమే కాకుండా హీరో బాగా చేసే సన్నివేశాల్లో కుడా సీన్స్ స్లో మోషన్‌లో చూపించడం వల్ల హీరోయిజం బాగా డల్లయింది. కథను సీరియస్‌గా ముందుకు నడిరచాలన్న తాపత్రయంలో ఎంటర్‌టైన్‌మెంట్ అనేది మర్చిపోయాడు తను అనుకున్న కథలో చాలా లూప్ హోల్స్ వుండడమే కాకుండా కొన్ని సీరియస్ సీన్లు కూడా నవ్వు తెప్పించేవిగా వున్నాయి.
చివరగా :నిజానికి హీరోకోసం ఈ దర్శకుడు మంచి వర్క్ కనబరిచినా కూడా అది తెరమీదికి తెచ్చే విషయం లో బాగా కన్ఫ్యుస్ అయ్యాడు. హీరో పాత్ర స్వభావం బాగా కొత్తగానే ఉంటాయి. పోలీస్ పాత్ర అంటే ఆ స్తాయి వైవిద్యం కనబరచడం లోకూడా ఓకే అని చెప్పాలి. ఇలా చార్లీ అనే ఖైది పాత్ర స్వభావం కుడా బాగానే చూపించాడు. వీరిద్దరి మద్య జరిగే సన్నివేశాలు కుడా ఓకే అనిపించాయి. అయితే కథలో ఎక్కడ కొత్తదనం అనేది కనిపించలేదు. ముందుగానే ఉహించె సన్నివేశాలు రావడం. కథ బాగా స్లోగా సాగడం తో ప్రేక్షకుడికి తలపోటు వ్యవహారం గా తయారైంది. దర్శకుడికి మొదటి బాగం మీద వున్న గ్రిప్ సెకండాఫ్‌లో లేదని చెప్పాలి. సెకండాఫ్‌ని ముగించేయాలి అనేలా ప్రయత్నం చేసాడు. ఇక ఇంట్రెస్టింగ్‌గా అనిపించే ఒక్క సీన్ కూడా మనకు కనిపించదు. ఇప్పటివరకు కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేస్తూ వస్తున్న నారా రోహిత్‌కి ఇది కూడా అలాంటి సినిమాయే అవుతుంది. స్లో నేరేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోవడం, క్యారెక్టర్లు కూడా తక్కువ కనిపించడం, సినిమా అంతా నారా రోహిత్‌నే చూడాల్సి రావడం వంటి వాటివల్ల ప్రేక్షకుడికి విసుగు అనిపించేలా కలిగిస్తాయి.

0 comments:
Post a Comment