మెగా డాటర్ నిహారిక కొణిదెల "ఒక మనసు" చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయం కానున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నెల 24వ తేదీన విడుదల కాబోతున్న ఈ చిత్రానికి ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ గా ఉన్నారు చిత్ర యూనిట్. ఈ సందర్భం గా ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన "నిహారిక తాను యాక్టర్ అవుదామని వచ్చా అని గ్లామర్ షో కి కాదు" అంటూ కొన్ని ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేసింది.
".తనకు హీరోయిన్ లలో ఎవరు రోల్ మోడల్ లేరు అని చెప్పిన నిహారిక తనకు ఉన్న ఏకైక రోల్ మోడెల్, ఇన్స్పిరేషన్ కేవలం మెగాస్టార్ చిరంజీవి మాత్రమే అని చెప్పింది. తనకు "నటి" కావాలన్న కోరిక తో ఫిల్మ్స్ లోకి వచ్చాను తప్ప గ్లామర్ షో చేయడానికి కాదు అని భవిష్యత్తు లో తననుఁ ఛాలెంజ్ చేసే పాత్రలు వస్తే నటిస్తా అని తెలిపింది . ఒకవేళ హీరోయిన్ని కాకపోయి ఉంటే కచ్చితం గా ప్రొడెక్షన్ వైపు వెళ్లేదాన్ని అని తనకి బాస్ పోసిషన్ ఇష్టం అని చెప్పింది. ఇక తన కో స్టార్ నాగ శౌర్య గురించి మాట్లాడుతూ తాను ఒక ఎమోషనల్ సీన్ లో సరిగ్గా నటించలేకపోతే శౌర్య తనకు దైర్యం చెప్పాడని వెంటనే ఆ సీన్ సరిగ్గా చేయగలిగా అని తెలిపింది."
మధుర శ్రీధర్, tv9 సంయుక్తం గా నిర్మిస్తున్న ఈ సినిమా ను రామరాజు తెరకెక్కించారు. ఈ రోజు సినిమా ప్రివ్యూ కోసం మెగాఫ్యామిలీ తో పాటు పవన్ కళ్యాణ్ కూడా హాజరవ్వబోతున్నట్టు సమాచారం









