Saturday, 21 November 2015

పవన్ తొందరపడుతున్నడా ?


తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాన్ నటించిన అత్తారింటికి దారేది చిత్రం తర్వాత దాదాపు రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకుని బాబీ దర్శకత్వంలో ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ మానియా బాగా పెరిగిపోయింది. అంతే కాదు టాలీవుడ్ లో  ‘సర్దార్’ సినిమా పై ఫోకస్ చేశారు.  గతంలో పవన్ కళ్యాన్ కి మంచి పేరు ఉన్నా హరిష్ శంకర్ దర్శకత్వంలో ‘గబ్బర్ సింగ్ ’ సినిమా తో విపరీతమైన క్రేజ్ పెరిగిపోయాంది. తెలుగు రాష్ట్రాల్లో పవన్ ఫ్యాన్స్ బాగా పెరిగిపోయారు. ఇంత ఫాలోయింగ్ ఒకప్పుడు చిరంజీవి కి ఉండేది.

ఇకపోతే పవన్ కేవలం సినిమాలపైనే దృష్టి పెట్టకుండా ప్రజా సేవలో కూడా పాలు పంచుకోవడంతో ఆయనపై మరింత అభిమానం పెరిగిపోయింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో ‘జనసేన’ పార్టీ స్థాపించి ప్రజల్లోకి వెళ్లాడు పవన్. నటుడిగానే కాకుండా మంచి రాజకీయ నాయకుడిగా ప్రజల తరుపు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలు పెట్టాడు. అత్తారింటికి దారేది చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని గోపాల గోపాల చిత్రంలో నటించారు. ఇప్పుడు ‘సర్ధార్ గబ్బర్ సింగ్ ’ చిత్రలో నటిస్తున్నారు..ఈ చిత్రం షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. మొదట పూనే,తర్వాత గుజరాత్ ఈ మద్య హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. తర్వాత గుజరాత్ వెళ్లారు చిత్ర యూనిట్..ఎడారి ప్రాంతాల్లో షూటింగ్ నిర్మాణం జరుగుతుంది.

ఇకపోతే సంక్రాంతి బరిలో దింపాలనుకున్నా ఆ మద్య పవన్ కళ్యాన్ వేసవి సెలవుల్లో వస్తుందని చెప్పారు.. కానీ జనవరిలో గ్రేటర్ ఎలక్షన్స్ రావడంతో ఇప్పుడు సినిమా కంప్లీట్ చేయాలని గట్టిగా నిర్ణయించాడు. అందుకే తన పూర్తి టైమ్ సినిమాకోసమే కేటాయిస్తున్నాడట..జనాల ముందుకు రావడానికి పవన్ కళ్యాన్ బాగా తొందర పడుతున్నాడు..ఎందుకంటే ఈ సినిమా ప్రభావం భవిష్యత్ రాజకీయాలకు కూడా పనికి వస్తుందని భావిస్తున్నట్టుంది. ఇకపోతే ఈ సినిమా పూర్తిగా కమర్షియల్, మేసేజ్ ఓరియెంటెడ్ లో రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా తమ అభిమాన నటుడు థియేటర్లో ఎప్పుడు దర్శనమిస్తాడా అని కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్.

0 comments:

Post a Comment