Wednesday, 29 April 2015

తానూ హిందూ ముస్లిం రెండు అంటున హీరో

సల్మాన్‌ఖాన్‌ ఏ మతానికి చెందినవాడు.? ఈ ప్రశ్నకు అతని సమాధానం ‘హిందూ ముస్లిం’ అని. న్యాయస్థానంలో సల్మాన్‌ఖాన్‌ తాను ఏ మతానికి చెందినవాడో వివరణ ఇచ్చాడు. తొలుత భారతీయుడినని గొప్పగా చెప్పుకున్న సల్మాన్‌ఖాన్‌, న్యాయస్థానం ‘ఏ మతం.?’ అని రెట్టించి అడిగేసరికి హిందూ, ముస్లిం.. అని సమాధానమివ్వాల్సి వచ్చింది. బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ రెండు కేసుల్లో ఇరుక్కుపోయాడు. ఒకటి కృష్ణజింకల్ని వేటాడిన కేసు. గతంలో జైలు శిక్ష కూడా అనుభవించాడు. దానికి సంబంధించినదే ఆయుధాల్ని కలిగి వున్న నేరం. అది కాకుండా, ఇంకోటి హిట్‌ అండ్‌ రన్‌ కేసు. తప్పతాగి వాహనం వేగంగా నడిపి, ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్నవారి మీదకు కారు ఎక్కించేసి ఒకరి మృతికి కారణమయ్యాడు సల్మాన్‌. ఈ కేసు కూడా విచారణ దశలో వుంది. న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతుండగా, న్యాయమూర్తి సల్మాన్‌ఖాన్‌ది ఏ మతం.? అని ప్రశ్నించారు. సల్మాన్‌ఖాన్‌ తండ్రి ముస్లిం. తల్లి మాత్రం హిందూ. ఇదే విషయాన్ని సల్మాన్‌ఖాన్‌ కోర్టుకు విన్నవించాడు. పేరులో ఖాన్‌ వున్నా, సల్మాన్‌ఖాన్‌ హిందూ సంప్రదాయాల పట్ల గౌరవం వున్నవాడు. ముంబైలో ఏటా వైభవంగా జరిగే దుర్గా పూజల్లోనూ, గణేష్‌ నవరాత్రి ఉత్సవాల్లోనూ పాల్గొంటాడు.  ముస్లిం మత పెద్దలనుంచి వ్యతిరేకత వ్యక్తమైనా తాను ఇండియన్‌ననీ, భారత దేశంలో ప్రతి మతాన్నీ గౌరవిస్తాననీ, ఆరాధిస్తాననీ చెప్పుకొచ్చేవాడు. అదే మాట ఇప్పుడు సల్మాన్‌ న్యాయస్థానం ముందూ చెప్పాడు. 

0 comments:

Post a Comment