Wednesday, 29 April 2015

చరిత్ర సృష్టించిన బాలయ్య

తెరపై డైనమెట్ లాంటి డైలాగ్స్ తో థియేటర్ దద్దరిల్లేలా చేసే సత్తా ఉన్న హీరో బాలకృష్ణ అన్న విషయం అందరికీ తెలిసిందే . గత సంవత్సరం బాలయ్య నటించిన లెజెండ్ చిత్రం రిలీజ్ అయి ఏకధాటిగా ఒకే థియేటర్ లో 400రోజులను పూర్తిచేసుకొని చరిత్ర సృష్టించింది . ఇప్పటివరకు తెలుగు చలన చిత్ర రంగంలో సంవత్సరం పాటు ,అంతకు మించి ఆడిన సినిమాలు ఉన్నాయి కానీ ఒకే థియేటర్ లో అందునా 400రోజుల పాటు ఆడిన సినిమాలు మాత్రం లేవు అది ఒక్క బాలయ్య కె సొంతం . లెజెండ్ చిత్రం కర్నూల్ జిల్లా ఎమ్మిగనూర్ లోని మినీ శివ థియేటర్ లో 400రోజులను పూర్తిచేసుకోవడం సంచలనంగా  మారింది . అలాగే ప్రొద్దుటూరు అర్చన థియేటర్ లో షిఫ్ట్ తో 400 రోజులు పూర్తి చేసుకోబోతోంది . 

0 comments:

Post a Comment