Friday, 15 May 2015

దుమ్మురేపుతున్న కిక్ 2

మాస్ మహారాజ్ రవితేజను డిఫరెంట్‌గా పరిచయం చేసి అతడి కెరీర్‌లో మరిచిపోలేని సినిమాగా నిలిచింది ‘కిక్’. ఇప్పుడా సినిమాకు సీక్వెల్‌గా ‘కిక్ 2′ రూపొందుతోన్న విషయం తెలిసిందే! ‘కిక్’ సినిమాకు దర్శకత్వం వహించిన సురేందర్ రెడ్డియే ఈ సినిమాకూ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై హీరో కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మించడం విశేషం. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించింది.థమన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ‘కిక్ 2′ ఆడియో గత శనివారం సాయంత్రం విడుదలైంది.
ఇదే వేడుకలో ఆడియోతో పాటు థియేట్రికల్ ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఈ ట్రైలర్‌కు అంతటా విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ‘కిక్’ సినిమాలో కిక్ అనే కాన్సెప్ట్‌తో కిక్కెక్కిస్తే, ఈ సినిమాలో కంఫర్ట్ అనే కొత్త కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తున్నట్టు కనిపిస్తోంది. రవితేజ ఎనర్జిటిక్ యాక్టింగ్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్‌లో విడుదలైన వారం రోజుల్లో ఈ ట్రైలర్ 10 లక్షల (1 మిలియన్)కు పైనే వ్యూస్ సాధించి దూసుకుపోతోంది. దీంతో ఈ సినిమాపై ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయన్నది మరోసారి ఋజువైంది. మరి ఆ అంచనాలను సినిమా అందుకుంటుందా అనేది తెలియాలంటే సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే!

0 comments:

Post a Comment