రాజధాని కోసం భూ సమీకరణ ముగిసిపోయింది. సమీకరణకు గడువు ఇదీ అని కోర్టుకు తెలిపింది ప్రభుత్వం. ఇక సేకరణే అని ప్రకటించింది. ఇప్పుడు సేకరణ నోటిఫికేషన్ వెలువడింది. గమ్మత్తుగా ఇప్పటికీ సమీకరణకు తలుపులు తెరిచే వున్నాయంటున్నారు మంత్రులు. ఏమిటిదంతా? ప్రజలను బెదరగొట్టి తీసుకోవడమా? లేకా భయానికి గురిచేయడమా? ఏది మంచిదో మీరే తేల్చుకోండి...భూమి లాక్కోవడం మాత్రం తప్పదు అని ప్రభుత్వం నికార్సుగా ప్రకటించేసింది. ఇంక ఇందులో అనుమానం ఏమీ లేదు...అయోమయం అంతకన్నాలేదు. అంతా పక్కా పిచ్చ క్లారిటీగా వుంది. అయినా.. జనసేన..పార్టీలో జనం లేరనుకోండి..పార్టీని, పార్టీ నాయకుడిని అభిమానించే జనంవుండొచ్చు. ఎందుకంటే ఇంకా పార్టీకి ఒక్క తలకాయ తప్ప, మిగిలిన బాడీ సంతరించుకోలేదు కదా. అలాంటి పార్టీ అధినేత, గడ్డం, లాల్చీ, చేతిలో పుస్తకంతో పక్కా మేధావిలా కనిపించే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు స్పందిస్తారు? ఇంత క్లారిటీగా భూములు తీసుకోవడం పై ప్రభుత్వం చాలా స్పష్టమైన వైఖరితోవున్నా పవన్ బాబు మాత్రం ఇంకా ఎందుకు ప్రజలకు కాల్ షీట్లు ఇవ్వడం లేదు? పవన్ కళ్యాణ్ తాను తెలివిగా వ్యవహరిస్తున్నాను అనుకుంటున్నారు. తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు. కానీ ఈ సాచివేత ధోరణే ఆయన పట్ల ప్రజలకు వున్న అభిమానాన్ని దూరం చేస్తుంది. ప్రజలు ఈ పవన్ కూడా ఆ తానులో ముక్కే అని నిర్థారణకు వచ్చేలా చేస్తుంది. అప్పుడు జనం అని, సేన అని వెంటబడినా అంతగా ప్రయోజనం వుండకపోవచ్చు. వేడి మీద వున్నపుడు ఉద్యమించాలి కానీ, అన్నీ చల్లారిపోయి, ప్రజలు నిర్లిప్త ధోరణికి మారిపోయినపుడు కాదు. అనవసరంగా పవన్ తన ఇమేజ్ డామేజ్ చేసుకుంటున్నారనిపిస్తోంది ఇదంతా చూస్తుంటే.

0 comments:
Post a Comment