Monday, 11 May 2015

అన్నదమ్ముల సవాల్


చిరంజీవి - పవన్ కళ్యాణ్ . ఒకరు 30 ఏళ్ళ పాటు తెలుగు సినీ లోకాన్ని మకుటం లేని మహారాజుల ఏలిన వారు ఐతే ఇంకొకరు సినిమా హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా విపరీతమైన క్రేజ్ తో 
దుసుకుపోతున్న వారు. ఇప్పుడు ఈ అన్నదమ్ముల మద్య అసలు సిసలు పోరు జరగబోతుంది. దాదాపు 8 ఏళ్ళ తర్వాత చిరు మల్లి వెండి తెరపై దర్శనం ఇవ్వబోతునారు. 
                                 అయన 150 వ చిత్రం తీయడానికి ఇప్పటికే సర్వం సిద్దం చేసుకున్నారు. పూరి జగన్నాధ్ దర్సకత్వం వహించే ఆ సినిమాకి రామ్ చరణ్ నిర్మాత. ఈ సినిమాని ఆగష్టు లో మొదలు పెట్టి జనవరి లో విడుదల చేయాలనీ ప్లాన్. అలానే అప్పుడు ఇప్పుడు అంటూ సాగదీసిన పవన్ గబ్బర్ సింగ్ 2 కూడా ఈ నెల 29 నుండి పట్టాలేక్కబోతుంది. ఈ సినిమాను కూడా జనవరి లో విడుదల చేయాలనీ నిర్ణయించారు. సంక్రాంతి కానుకగా రానున్న ఈ రెండు సినిమాల కారణం గా అన్నదమ్ముల మద్య బారి బాక్స్ ఆఫీసు వార్ జరిగేల ఉంది. ఇదే జరుగుతుందో లేక అన్న కోసం తమ్ముడు లేదా తమ్ముడు కోసం అన్న వెన్నకి తగ్గుతారొ వేచి చూడాల్సిందే   

0 comments:

Post a Comment