Monday, 11 May 2015

ఐటమ్ సాంగ్స్ వల్లే రేప్ లు జరుగుతున్నయంటున్న నటుడు


సినిమాల్లో ఐటెం సాంగ్స్ కున్న ప్రత్యేకత ఏమిటో అందరికి తెలిసిందే. సినిమాకు అదనపు ఆకర్షణ కోసం ఐటెం సాంగ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ పాటలకు బాలీవుడ్ లో మరింత క్రేజ్ ఉంది. బాలీవుడ్ లో ఐటెం సాంగ్ ఒకదానికి మించి మరొక సాంగ్ ను హాట్ హాట్ గా క్రియేట్ చేస్తూ సినిమాలకు అట్రాక్షన్ తీసుకువస్తున్నారు. అయితే ఈ పాటల విషయం లో ఇప్పుడు బాలీవుడ్ లో సంచలనం క్రియేట్ చేసాడు ఓ సీనియర్ నటుడు. దేశం లో రేప్ లు పెరిగిపోవడానికి సినిమాలలో హాట్ హాట్ ఐటెం సాంగ్స్ కారణం అని అంటున్నాడాయన ! ఈ విషయం అన్నది ఎవరో కాదు ప్రముఖ నటుడు ఓం పూరి. ఇటివలే జరిగిన ఓ కార్యక్రమం లో అయన ఈ మాట అన్నాడు. మరి ఈ విషయం ఇప్పుడు బాలీవుడ్ లో మరెలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి. 

0 comments:

Post a Comment