Friday, 8 May 2015

బడా బాబులందరికి షాక్ ఇచ్చిన రజనీకాంత్

సూపర్ స్టార్ గా తనదైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న రజని కాంత్ లింగా సినిమా వాళ్ళ కొన్ని రోజులు రకరకాల టెన్షన్ ను అనుబవించాడు. అయితే ఆయనతో సినిమా చేయడానికి ఇప్పటికే పలువురు పెద్ద దర్శకులు సైతం క్యూ లో ఉన్నారు. ఇప్పటికే శంకర్ దర్శకత్వం లో రోబో 2 వస్తుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్ గా ఇప్పుడు రజని అందరికి షాకిచ్చాడు. ఓ చిన్న దర్శకుడితో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు ? అట్టకట్టి , మద్రాస్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రంజీత్ దర్శకత్వం లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కాలై పులి దాను నిర్మిస్తున్నాడు. ఇటివలే అయన ఈ సినిమా గురించి ప్రకటించాడు. రజని కాంత్ తో సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు. తమిళ , తెలుగు బాషలలో ఏకకాలం లో ఈ సినిమా నిర్మిస్తామని, త్వతలోనే షూటింగ్ ప్రరంబిస్తామని అయన ప్రకటించాడు.

0 comments:

Post a Comment