టిడిపి mlc పదవులలో ఒక దానిని బిజెపి కి ఇచ్చింది. ఇలా ఆయనకు ఆ అవకాశం దక్కడం వెనుక పవన్ కల్యాణ్ ప్రమేయం ఉందని తెలుస్తోంది. పవన్ కు బాగా దగ్గరవాడిగా ప్రచారం పొందాడు వీర్రాజు. పవన్ ను మోడీ దగ్గరకు తీసుకెళ్లడం దగ్గర నుంచి అనేక వ్యవహారాల్లో వీర్రాజు చొరవ చాలా ఉంది. ఇలాంటి నేపథ్యంలో పవన్ ద్వారా చాలా రోజులుగా లాబీయింగ్ చేసుకొంటున్నాడు ఆయన. ఇప్పుడు బీజేపీ కి ఇచ్చిన అవకాశం.. ఆయనకు అవకాశంగా మారడానికి ఈ లాబీయింగే కారణం అనమాట. మొత్తానికి పవన్ లాబీయింగ్ కు ఇప్పుడిప్పుడే ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆ మధ్య టీటీడీ పదవి ఒకటి.. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి .. ఇవన్నీ పవన్ సత్తాకు ప్రతిరూపాలే కదా!

0 comments:
Post a Comment