Sunday, 3 May 2015

మహేష్ కి పవన్ కి పోటి తప్పదా ?

వచ్చే సంక్రాంతి కి పవన్ కళ్యాణ్ తో మహేష్ బాబు పోటీకి సిద్దమౌతున్నాడు. అవును 2016 సంక్రాంతి కి స్టార్ వార్ జరుగనుంది . పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 2 సంక్రాంతికి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఇక మహేష్ బ్రహ్మోత్సవం కూడా సంక్రాంతికి రిలీజ్ చేయడానికి పూనుకుంటున్నారు దర్శక నిర్మాతలు . ఇద్దరు కూడా ఈ రెండు చిత్రాల రిలీజ్ డేట్ లను ప్రకటించారు కానీ విచిత్రం ఏమిటంటే ఈ రెండు చిత్రాలు కూడా ఈనెలలో ప్రారంభం కానున్నాయి తప్ప ఇంకా మొదలు కాలేదు . ఒకవేళ ఈ రెండు చిత్రాలు కనుక సమయానికి పూర్తయితే సంక్రాంతి సమరం తప్పేలా లేదు . ఇద్దరు టాప్ స్టార్స్ కనుక సంక్రాంతికి పోటీ పడితే అది అందరికీ ఇబ్బందే . మరి ఆ ఇబ్బంది ని ఎలా అధిగమిస్తారో చూడాలి .

0 comments:

Post a Comment