Wednesday, 6 May 2015

హిట్ అండ్ రన్ కేసు లో సల్మాన్ కు ఐదేళ్ళ జైలు

హిట్ అండ్ రన్ కేసు లో సల్మాన్ కు ఐదేళ్ళ జైలు  శిక్ష పడింది ....ఏళ్ళ తరబడి కేసు నడిచింది.. కానీ ఆ కేసులోంచి ఊరట లభించలేదు. ఎన్నెన్నో జిమ్మిక్కులు జరిగాయి. ‘నేను కారు నడపడంలేదు’ అని బుకాయించాడు. కానీ అక్కడ ఓ ప్రాణం పోయింది. ‘నేనే ఆ కారు నడిపాను’ అని డ్రైవర్‌ ఒప్పుకున్నాడు. నానా రకాల వాదనలూ తెరపైకొచ్చాయి. చివరికి బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌, కండల వీరుడు, బాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ ‘హిట్‌ అండ్‌ రన్‌’ కేసులో దోషిగా తేలాడు  ఇది ఇప్పటి కేసు కాదు, పదేళ్ళకు పైనే అవుతుంది సల్మాన్‌ఖాన్‌ కారు నడిపి, ఓ వ్యక్తి మృతికి కారణమై. అప్పటినుంచీ ఇప్పటిదాకా కేసు నడుస్తూనే వుంది. చివరికి కేసు ఓ కొలిక్కి వచ్చింది. సల్మాన్‌ఖాన్‌ దోషి అని తేలింది. బాలీవుడ్‌ మొత్తం సల్మాన్‌ఖాన్‌కి నైతిక మద్దతును ప్రకటించింది. అనుకోకుండా జరిగిన ఘటనే అయినా, ఈ కేసు నుంచి సల్మాన్‌ఖాన్‌ తప్పించునేందుకు చెప్పిన మాటలు, చేసిన పనులు.. ఆయన ఇమేజ్‌ని సర్వనాశనం చేసేశాయన్నది నిర్వివాదాంశం. -

0 comments:

Post a Comment