ఎన్నో ఆపసోపాలు పడి ప్రేక్షకుల ముందుకు వచ్చింది గంగ . ప్రేక్షకులను భయపెడుతూనే మొదటి రోజు ఆలస్యం అయినప్పటికీ మంచి వసూళ్ళ నే సాధించింది గంగ . రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళనాట కూడ మంచి వసూళ్ళ ను సాధిస్తోంది . హర్రర్ కామెడీ కథాంశం తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది . తాప్సీ ,రాఘవ ,నిత్యా మీనన్ ల నటన అందరినీ సంబ్రమస్చార్యాలలో ముంచెత్తుతోంది . ఈ వేసవి లో సరైన సినిమా రాకపోవడంతో ఆకలి మీదున్న ప్రేక్షకులకు గంగ హర్రర్ తో కూడిన కామెడీ ని పంచి తొలిరోజు 3కోట్ల 55లక్షలను వసూల్ చేసి సంచలనం సృష్టించింది . ఈజోరు ఇలాగె కొనసాగితే తెలుగులో కూడా ఘనవిజయం సాధించేలా ఉంది .

0 comments:
Post a Comment