ఇటీవల కాలంలో లో దుస్తుల యాడ్స్ ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయి. అయితే, వాటి గురించి ఎవరు అంత పెద్దగా పట్టించుకోరు. అయితే, ఏదైనా స్పెషల్ ఉంటేనే వాటిపై విమర్శలు వస్తాయి. ఫాదర్స్ డే రోజైన ఈనెల 21న వార్తాపత్రికలలో “ట్రంప్” కంపెనీ లో దుస్తుల గురించి ముఖ్యంగా మహిళల “బ్రా” గురించి యాడ్ ఇచ్చింది. ఫాదర్స్ డే సందర్భంగా మహిళల కోసం తమ కంపెనీకి చెందిన “బ్రా” లలో 15% డిస్కౌంట్ ఇస్తున్నట్టు ప్రకటిస్తూ యాడ్ ఇచ్చింది.
ఇక, దీనిపై సర్వత్రా విమర్శలు ఎదురౌతున్నాయి. ఈ యాడ్ ను అనేక మంది బాలివుడ్ ప్రముఖులు విమర్శించారు. తండ్రి కూతుర్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఫాదర్స్ డే రోజున ఫాదర్స్ డే స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ పేరుతో “బ్రా” కంపెనీ డిస్కౌంట్ ప్రకటించడాన్ని హీరోయిన్ పూజా హెగ్డే తనదైన శైలిలో విమర్శిస్తూ ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. పూజా హెగ్డే తో పాటు బాలివుడ్ నటులు ఫర్హాన్ అక్తర్, రిషి కపూర్ తదితరులు ఈ యాడ్ ను విమర్శించిన వారిలో ఉన్నారు. 1886లో స్థాపించిన ట్రంప్ కంపెనీ పై ఇంత ఎత్తున విమర్శలు రావడం ఇదే మొదటిసారి.

0 comments:
Post a Comment