Tuesday, 23 June 2015

అయోమయంలో ‘జనసేను’డి ఫ్యాన్స్

తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో టిఆర్ఎస్ తెలుగుదేశం పార్టీలు అధికారంలో ఉన్నాయి. అధికారంలో ఉన్న ఈ రెండు పార్టీల మధ్య ఇప్పుడు రాజకీయంగా, అధికార పరంగా గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒక పార్టీపై మరోపార్టీ పైచేయి సాధించాలని చూస్తున్నది. నోటుకు ఓటు, ఫోన్ ట్యాపింగ్ వంటి పలు రకాలైన సమస్యలతో రెండు రాష్ట్రాలు సతమతమవుతున్నాయి.
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ నామినేటెడ్ ఎమ్మెల్యే ను కొనాలని చూసింది. రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు 50 లక్షల రూపాయలు లంచం ఇస్తూ ఏసీబీ అధికారులకు చిక్కడు. అక్కడి నుంచి అసలు గొడవలు ప్రారంభమయ్యాయి. నోటుకు ఓటు వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారింది. రెండు రాష్ట్రాల నేతలు, రెండు పార్టీల నేతలు మాటల యుద్దానికి దిగారు. రేవంత్ రెడ్డి ఇష్యూ జరిగిన వారం రోజులకు తెలంగాణ కు చెందిన చానల్ లో చంద్రబాబు నాయుడు వాయితో కూడిన ఫోన్ సంభాషణలు ప్రసారం కావడంతో రాజకీయ వ్యవహారం కాస్త రాష్ట్రాల వ్యవహారంగా మారింది. స్టీఫెన్ సన్ తో చంద్రబాబు మాట్లాడినట్టు వచ్చిన వార్తలపై పెద్ద దుమారం రేగింది. దీనిపై అన్ని పార్టీలు స్టేట్మెంట్ లు ఇచ్చాయి. లోక్ సత్తా పార్టీ కూడా చంద్రబాబు ను తప్పుపడుతూ స్టేట్మెంట్ ఇచ్చింది.
అయితే, సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ తరపున అటు దేశంలో బీజేపి తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు. జనసేన పార్టీని నెలకొల్పినప్పటికీ.. పోటీచేయలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులలో ఉన్నదని, చంద్రబాబు వంటి సమర్ధత కలిగిన నాయకుడు అధికారంలోకి వస్తే.. రాష్ట్రం తిరిగి గాడిన పడుతుందని అప్పట్లో పవన్ కళ్యాణ్ పేర్కొన్న సంగతి చూశాం. పార్టీలు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని పక్షంలో తాను ప్రజలతరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానాని ఎన్నోసార్లు చెప్పారు.
అయితే, నోటుకు ఓటు, ఫోన్ ట్యాపింగ్ సంఘటనలపై పవన్ పార్టీ ఇప్పటివరకు స్పందించలేదు. పవన్ స్పందించకపోవడంపై అనేకమంది అనేకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆయా నేతలు, నాయకులు మాట్లాడే మాటలతో జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇబ్బందులకు గురవుతున్నారట. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ వంటి ఒక బలమైన నేత చిన్న స్టేట్మెంట్ ఇస్తే ఇన్ని మాటలు పడవలసిన అవసరం ఉండదని కూడా కొందరు అంటున్నారు. మరి పవన్ మనసులో ఏమ్మున్నదో.. ఆ దేవుడికే ఎరుక.


0 comments:

Post a Comment