Sunday, 21 June 2015

న్యాయనిర్ణేతగా పవన్ కళ్యాణ్..?


పవన్ కళ్యాణ్ గురించి అనేక మంది అనేక వ్యాఖ్యాలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం, బీజేపి కి మద్దతిచ్చిన పవన్ కళ్యాణ్ అనంతరం రెండు పార్టీలకు దూరంగా ఉంటూ.. అవసరమైనపుడు ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని చెప్పిన సంగతి విదితమే. సంవత్సరం గడిచింది. కేంద్రం సంగతేమో కాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం రాజకీయాలలో అనేక మార్పులు సంభవించాయి. నోటుకు ఓటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తెలుగుదేశం ప్రభుత్వం అతలాకుతలమవుతున్నది.
రాష్ట్రంలో ఇన్ని జరుగుతున్నా, జనసేన అధ్యక్షుడు నోరు మెదపకపోవడాన్ని నాయకులతో పాటు కొన్ని పత్రికలు కూడా బహిరంగంగా విమర్శిస్తున్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపి ముఖ్యమంత్రిపై మ్యాంగో ప్రేమను కనబరుస్తున్నాడంటు తెలంగాణ కు చెందిన ఓ ప్రముఖ పత్రిక ప్రచురించింది. వర్మ వంటి దర్శకులు, వీహెచ్ వంటి సీనియర్ నేతలే కాకుండా అనేక మంది నాయకులు అడుగుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం హాస్యాస్పధంగా ఉన్నదంటూ పేర్కొన్నది.
రోజులు గడిచేకొలది పవన్ కళ్యాణ్ పై విమర్శలు జోరు పెరిగిపోతున్నది. నోటుకు ఓటు, ఫోన్ టాపింగ్ వ్యవహారంలో తన మాటేమిటో చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఏవిషయం చెప్పిన అది ఆలోచింది అందరికీ మంచి అనిపించింది చెప్పాలి. ఒక న్యాయనిర్ణేతగా వ్యాఖ్య చేయాలి. అలా చెప్పని పక్షంలో ఇలా విమర్శలను ఎదుర్కొనవలసి వస్తంది. సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నా, పవన్ ఎక్కడి నుంచైనా ఈ విమర్శలపై ఒక వ్యాఖ్య చేయాలి. లేదంటే మాత్రం విమర్శలు ఎదుర్కోక తప్పదు.

0 comments:

Post a Comment