అవును, మీరు చదివేది కరెక్టే!. చిరంజీవి త్వరలోనే జనసేన తీర్ధం పుచ్చుకోనున్నాడట. ఇప్పటికే, దానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ జరిగిపోయాయట. అన్నీ అనుకూలిస్తే ఆషాఢమాసం ముగిసి.. కార్తీక మాసం ఎంటరయ్యేలోపు.. పవన్ సోదరుడు, కాంగ్రెస్ నేత చిరంజీవి జనసేన పార్టీలోకి ఎంట్రీ ఇవ్వడం గ్యారంటీ.
కొందరు కాపు సంఘం నేతలు రీసెంట్‌గా మెగా బ్రదర్స్‌ని ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ముందు చిరుని కలిశారు. కాంగ్రెస్‌ని వీడి.. జనసేన పార్టీలోకి రావాలని సూచించారట. ఇందుకు మొదట చాలా తటపటాయించిన చిరు, ఆ తర్వాత ఓకే చెప్పారట. ముందు పవన్‌తో మాట్లాడి చెప్పాలని వారికి తెలిపారు. ఇదే మేటర్‌ని పవన్‌కి వివరించగా, అన్నయ్య రాకకు తమ్ముడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
విశ్వసనీయ సమాచారం మేరకు.. చిరంజీవికి ఫోన్ చేసి పలుకరించాడు పవన్. చిరు 150వ సినిమా గురించి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాడు. కథతో పాటు దర్శకుడు లాంటి విషయాలు కూడా వారి మధ్య చర్చకు వచ్చాయని సమాచారం. అయితే, చిరు-పవన్ మధ్య గత మూడున్నరేళ్లుగా సరయిన మాటలు లేవు. మాట్లాడుకోవడాల్లేవ్.
రచ్చ, గబ్బర్‌సింగ్ లాంటి ఆడియో ఫంక్షన్‌లలో ఇద్దరూ కలిసినా అవి మెగాభిమానుల కోసం, ఫోటోల కోసం మాత్రమే. కానీ, చాలా గ్యాప్ తర్వాత చిరుకి పవన్ ఫోన్ చేయడంతో ఇద్దరి మధ్య గ్యాప్ కొంతమేరకు తగ్గిందంటున్నారు మెగా సన్నిహితులు. అన్నాదమ్ములిద్దరి మధ్య అంతా సవ్యంగా జరగడంతో ఇప్పుడు చిరంజీవి జనసేన ఎంట్రీలోకి ముహూర్తం ఫిక్స్ చేసే పనిలో పడ్డారు వారిని కలిసిన కాపు సంఘం నేతలు. దీనిపై, త్వరలోనే ఓ అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ప్రస్తుతం ఆషాఢ మాసం కావడంతో త్వరలోనే దీనికి ముహూర్తం చూసే పనిలో పడ్డారట కాపు సంఘం నేతలు.

0 comments:
Post a Comment