Tuesday, 7 July 2015

బాహుబలికి ఆ ఒక్కడు దూరం

భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి సినిమా గురించి మాట్లాడ్డానికి లోకమంతా ఒక్కటైంది. మెగాస్టార్ చిరంజీవి నుంచి సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ వరకు అంతా బాహుబలి జపమే చేస్తున్నారు. మహేష్ అయితే బాహుబలి కోసం ఏకంగా తన సినిమానే వాయిదా వేసుకున్నాడు. చివరికి ఆడియో ఫంక్షన్ కూడా పోస్ట్ పోన్ చేసుకున్నాడు. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా ఒక సందర్భంలో బాహుబలి ప్రాజెక్ట్ ను మెచ్చుకున్నారు. అటు అక్కినేని హీరోలు, నందమూరి టైగర్లు కూడా బాహుబలిపై ప్రశంసలు కురిపించారు. బాహుబలి ఆడియో ఫంక్షన్ టైమ్ లోనే బాలయ్య, ఆ ప్రాజెక్ట్ పై ప్రశంసలు కురిపించాడు. అయితే ఇంతమంది స్పందించినప్పటికీ ఒకేఒక్కడు మాత్రం బాహుబలి మేనియాకు దూరంగా ఉన్నాడు. అతడే వన్ అండ్ ఓన్లీ పవన్ కల్యాణ్. ఇండస్ట్రీ అంతా ఒక్కటై బాహుబలిని మోసేస్తుంటే పవన్ మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదు. కనీసం ఆ సినిమా గురించి ట్విట్టర్ లో కూడా ప్రస్తావించలేదు. తన పనేదో తాను చూసుకుపోతున్నాడు. రిలీజ్ కు దగ్గరవుతున్న ఈ టైమ్ లోనైనా బాహుబలి గురించి పవన్ ఓ 4 ముక్కలు మంచిగా మాట్లాడితే బాగుంటుందని అంతా అనుకుంటున్నారు. మరి బాహుబలి ప్రాజెక్ట్ గురించి పవన్ ఎందుకు మాట్లాడ్డం లేదనే విషయం మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలిపోయింది.

0 comments:

Post a Comment