Monday, 6 July 2015

తెలుగుజాతి ఐఖ్యతపై కెసిఆర్ ను పొగిడిన పవన్


తెలుగుజాతి ఐఖ్యతకు మొదటగా కృషి చేసిన వ్యక్తీ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అని కితాబిచ్చారు. యాదాద్రి నిర్మాణానికి ఆర్కిటెక్ట్ గా విజయనగరానికి చెందిన ఆనందసాయిని నియమించడం గర్వించదగిన విషయమని ఆ విషయంలో కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నాని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో సీబీఐ విచారణ జరిపించాలని అన్నారు. ఒక ముఖ్యమంత్రి యొక్క ఫోన్ ట్యాప్ చేయడం తప్పని పవన్ కళ్యాణ్ చెప్పారు. సీబిఐ విచారణలో ఎవరు తప్పులు చేశారు.. ఎవరు తప్పులు చేయలేదు అన్నది తెలుస్తుందని… తప్పు చేసిన వాళ్ళని తప్పకుండా శిక్షించాలని ఆయన తెలిపారు.
ఇక, తలసాని శ్రీనివాస్ తెలుగుదేశం నుంచి టిఆర్ఎస్ పార్టీలోకి వచ్చినా.. సనత్ నగర్ ప్రజల నమ్మకాన్ని తెచ్చుకోగలరా అని ఆయన ప్రశ్నించారు. విభజన తరువాత కేంద్రం ఆంధ్రప్రదేశ్ ను పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

0 comments:

Post a Comment