Sunday, 5 July 2015

తల్లి బిడ్డలను కలిపినా పేస్ బుక్

పేస్ బుక్ ఓ తల్లీబిడ్డలను కలిపింది . దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం దూరం అయిన ఆ తల్లీ కొడుకులు పేస్ బుక్ పుణ్యమా అని కలవబోతున్నాం అని సంతోషపడుతోంది ఆ తల్లి . సంఘటన వివరాలలోకి వెళితే ............. కుటుంబ కలహాల వల్ల జోనాధన్ (18) అనే కుర్రాన్ని అతడు మూడేళ్ళ వయసులో ఉన్నప్పుడు అతడి తండ్రి మెక్పికో కు తీసుకుపోయాడు . అయితే ఏడాది క్రితం జోనాధన్ పేస్ బుక్ లో తన చిన్నప్పుడు తన అన్నతోకలిసి దిగిన ఫోటోని పెట్టాడు . ఇది నా చిన్నప్పటి ఫోటో అని పక్కన ఉన్నది తన అన్నయ్య అని పేస్ బుక్ లో పెట్టడంతో ఆ ఫోటో ని జోనాధన్ తల్లి హాప్ హాలండ్ చూసి అతడు తన కొడుకే అని భావించి ఎలాగైనా సరే తన కొడుకుని తన దగ్గర కు తెచ్చుకోవాలని చేసిన ప్రయత్నాలు మొత్తానికి ఫలించాయి .  కాలిఫోర్నియా లో ఉంటున్న తల్లి దగ్గరకు జోనాధన్ త్వరలోనే రానున్నాడు . ఫోన్ లో తల్లీ కొడుకులు మాట్లాడుకొని ఈ ప్రపంచాన్ని మర్చిపోయారట 

0 comments:

Post a Comment