Saturday, 17 October 2015

బంపర్ ఆఫర్ కొట్టిన నిఖిల్


         వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో నిఖిల్ కి బంపర్ ఆఫర్ తగిలింది. తన లేటెస్ట్ మూవీ "శంకరాబారణం" శాటిలైట్ హక్కులను జీ తెలుగు చానెల్ సుమారు 4 కోట్ల రూపాయిలకు తీసుకున్నారు.క్రైమ్ కామెడీ జోనేర్ లో సాగే ఈ సినిమాను కొత్త దర్శకుడు ఉదయ్ నందనవనం తెరకేక్కిస్తునారు.
         కోన వెంకట్ సమర్పణ లో ఎంవివి సత్యనారాయణ ఎంవివి సినిమా బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తునారు.
కాగా ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే కూడా కోన వెంకటే సమకురుస్తునారు. నందిత హీరోయిన్ గా నటిస్తున ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తునారు.   
         ప్రతి సినిమాకు తన మార్కెట్ పరిధి పెంచుకుంటూ వెళ్తున్న నిఖిల్ కి శాటిలైట్ మార్కెట్ కూడా ఇలానే పెరిగితే త్వరలోనే స్టార్ హీరోలకు సమానంగా ఎదుగుతాడు అనడం లో ఎలాంటి సందేహం అక్కర్లేదు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విడుదల చేసిన ఈ సినిమా టిజర్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది 

0 comments:

Post a Comment