Saturday, 17 October 2015

సోషల్ మీడియా లో చిరు హల్చల్

          దాదాపు ఆరేళ్ళ తర్వాత ముఖానికి మేకప్ వేసుకున్న చిరంజీవి బ్రూస్ లీ సినిమాలో అతిధి పాత్ర లో మెరిసారు.సినిమా చివర్లో హీరోకు సహాయం చేసే పాత్ర లో ఇరగాదీసేసారు చిరంజీవి. తెరపై కనిపించిన ఆ ఐదు నిమిషాలలో తన మార్క్ మేనరిజం చూపించారు. వయసు పెరిగిన వన్నె తగ్గలేదని నిరూపించారు చిరు. సినిమాకు  మిక్స్ డ్ టాక్ వచ్చిన చిరు ఎపిసోడ్ కి మాత్రం ప్రేక్షకుల నుండి అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది.
          ఐతే ఈ సినిమాకు ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చి పడింది. సినిమాలో చిరు నిడివి ఉన్న వీడియో ను కొంత మంది ఫేస్ బుక్ ,ట్విట్టర్,యుట్యూబ్  వంటి సోషల్ మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తునారు. వీటిని తొలగించడానికి సినిమా నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు     

0 comments:

Post a Comment