Monday, 16 November 2015

సంచలనం కలిగిస్తున మహేష్ 300 కోట్ల డీల్

                                                                    
‘శ్రీమంతుడు’ తర్వాత మహేష్ ను కేవలం ఒక టాప్ హీరోగానే కాకుండా ఒక  మంచి విషయాలను ప్రచారంచేసే బాధ్యతగల వ్యక్తిగా మహేష్‌ బాబుని అందరూ  చూస్తున్నారు. ఈ సినిమా తరువాత మహేష్ వ్యక్తిత్వoలో చాలా మార్పులు వచ్చాయని అతని సన్నిహితులు అంటున్నారు. తానూ సంపాధించిన దానిలో కొంత భాగం సమాజనికి  ఉపయోగించాలి అన్న ఆలోచనలు ‘శ్రీమంతుడు’ మహేష్ కు మాత్రమే కాకుండా చాలామందికి ఆలోచనలను కలుగచేసింది. 

ఈ పరిస్థితులు ఇలా ఉండగా  మహేష్ తన  సొంత బ్యానర్‌ ‘యం.బి ఎంటర్‌ టైన్స్‌ మెంట్స్‌’1 ఆరంభించి సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ‘శ్రీమంతుడు’ చిత్రంతోనే ఈ బ్యానర్‌ ఆరంభమయింది. మహేష్‌ బాబు లేటెస్ట్ గా  చేస్తున్న 'బ్రహ్మోత్సవం' సినిమాకు  కూడ నిర్మాతలలో ఒకడుగా వ్యహరిస్తున్నాడు. ఈనేపధ్యంలో ఈ మధ్య మహేష్‌ బాబు ఒక భారీ డీల్‌ ని ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ వారితో కుదుర్చుకున్నాడని  ఫిలింనగర్ లో వార్తలు హడావిడి చేస్తున్నాయి.

బాలీవుడ్‌ లో ఒకవైపు భారీ చిత్రాలు నిర్మిస్తూ మరో వైపు  పంపిణీ చేస్తున్న ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ లేటెస్ట్ ‘డిక్టేటర్‌’ సినిమాకు టాలీవుడ్‌లో నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. మహేష్‌ బాబు హీరోగా రూపొందిన '1', 'ఆగడు', 'శ్రీమంతుడు' చిత్రాలను పంపిణీ చేసిన ఈ సంస్థ తాజాగా మహేష్‌ బాబుతో 300కోట్ల భారీ డీల్‌ ని కుదుర్చుకుందని టాక్. ఈ డీల్ ప్రకారం మహేష్‌ బాబు నటిస్తున్న సినిమాలకు సంబంధించిన పంపిణీ హక్కులు ఈరోస్‌ సంస్థకు ఇచ్చేయాలట.  

అయితే ఈ డీల్ ఎన్ని సినిమాలకు సంబంధించి అన్న విషయం పై క్లారిటీ లేకపోయినా ఈ డీల్ విషయమై ఈ మధ్య  మహేష్‌ బాబు, ఈరోస్  సంస్థ సి.ఇ.ఓలు మధ్య ప్రాధమిక చర్చలు జరిగినట్లు ఫిలింనగర్ టాక్. అయితే ఈరోస్ మహేష్ సినిమాలను  మాత్రమే పంపిణీ  చేస్తుందా లేదంటే మహేష్ తో వరసగా సినిమాలు తీస్తుందా అనే విషయమై భిన్న కధనాలు వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా మహేష్ ౩౦౦ కోట్ల డీల్ ప్రస్తుతం టాలీవుడ్ వర్గాలలో హాట్ టాపిక్..

0 comments:

Post a Comment