Monday, 16 November 2015

ఎటు తేల్చుకోలేకపోతున్న చిరు


                                                                  
రోజులు గడుస్తున్న కొద్దీ చిరంజీవి 150వ సినిమా వ్యవహారం ఒక జోక్ లా మారిపోతోంది. తన 150వ సినిమా కథ విషయంలో చిరంజీవి అయోమయానికి తోడు పరిస్థుతుల ప్రభావం కూడ చిరంజీవి ఒక ఫైనల్ నిర్ణయం తీసుకునే విషయంలో తీవ్ర గందర గోళంలో పడేస్తోంది అన్న మాటలు మాత్రం వాస్తవం. ‘బ్రూస్ లీ’ విడుదల అయ్యేవరకు చిరంజీవి ‘కత్తి’ రీమేక్ లో వినాయక్ దర్శకత్వంలో నటించడం ఖాయం అని అనుకున్నారు అంతా. 

రామ్ చరణ్ కోసం ‘బ్రూస్ లీ’ లో చిరంజీవి మూడు నిముషాలు కనిపించినా ఆ భవిష్యత్ ను మార్చలేక పోయాడు చిరంజీవి. దీనితో తన హవా పై తనకే అపనమ్మకం ఏర్పడటంతో చిరంజీవి తన 150వ సినిమా విషయంలో ‘అఖిల్’ పరీక్షలో వినాయక్ నెగ్గితే వినాయక్ గురించి ఆలోచిద్దాం అని అనుకున్నాడట. అయితే ‘అఖిల్’ సినిమా ఘోరపరాజయం తరువాత వినాయక్ చిరంజీవిని మర్యాద పూర్వకంగా కలిసినా తన 150వ సినిమా విషయాలు కాకుండా మిగతా విషయాలను చిరంజీవి వినయాక్ తో మాట్లాడినట్లు ఫిలింనగర్ టాక్. 

దీనితో షాక్ అయిన వినాయక్ తాను ఒక రెండు నెలలు పాటు సినిమా విషయాలకు దూరంగా ఉంటున్నాను అంటూ మీడియాకు లీక్ ఇచ్చాడు. పరిస్థుతులు ఇలా ఉండగా చిరంజీవి మళ్ళీ పూరి వైపు యూటర్న్ తీసుకున్నాడు అంటూ ఫిలింనగర్ లో వార్తల హడావిడి మొదలైంది. పూరి వరుణ్ తేజ్ తో తీస్తున్న ‘లోఫర్’ సినిమా ఫలితం బట్టి పూరీకి మళ్ళీ మెగా కాంపౌండ్ నుండి పిలుపు వచ్చినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. 

ఈలోపు చిరంజీవి దృష్టి త్రివిక్రమ్ క్రిష్ లాంటి దర్శకుల వైపు కూడ ఉంది అనే సంకేతాలు ఉన్నాయి. ఏ విషయం ఎలా ఉన్నా చిరంజీవి ప్రస్తుతం దర్శకులతో ఆడుతున్న మ్యూజికల్ చైర్ గేమ్ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది..

0 comments:

Post a Comment