Wednesday, 18 November 2015

సర్దార్ సీక్రెట్స్ ని బయటపెట్టిన లక్ష్మి రాయ్

                                                                  
కన్నడ బ్యూటీ లక్ష్మీరాయ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటిదాకా ఈసినిమాలో లక్ష్మీరాయ్ పాత్ర కేవలం ఐటమ్ సాంగ్ కే పరిమితం అనుకున్నారు అంతా. అయితే అందరి ఊహాలను తలక్రిందులు చేస్తూ లక్ష్మీరాయ్ ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈసినిమాకు సంబంధించిన ఒక టాప్ సీక్రెట్ ను బయట పెట్టింది. 

‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాలో లక్ష్మీరాయ్ పవన్ తో రెండు పాటలలో కనిపిస్తుందట. అంతేకాదు ఈసినిమా కథకు ఒక మలుపు తిప్పే పాత్రలో తాను కనిపించబోతున్న విషయాన్ని లీక్ చేసింది. పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ లో ‘కెవ్వుకేక’ ఐటమ్ సాంగ్‌తో అదరగొడితే ‘సర్దార్ గబ్బర్‌ సింగ్’ లో అదే స్పీడ్ ను మెయిన్‌ టెయిన్ చేస్తూ పవన్ ‘తోబా తోబా’ అంటూ లక్ష్మీరాయ్ తో చిందులు వేస్తాడట పవన్. అంతేకాదు ఈ పాట 2016వ సంవత్సరానికి సూపర్ హిట్ సాంగ్ గా నిలిచి పోతుంది అని అంటోంది లక్ష్మీరాయ్. 

చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ పాటను వినగానే జోష్ లోకి వెళ్ళిపోతారు అంటూ తన ఐటమ్ సాంగ్ పై అంచనాలు పెంచేసింది లక్ష్మీరాయ్. ఇదే సందర్భంలో పవన్ గురించి మాట్లాడుతూ తన సినిమా కెరియర్ లో పవన్ లాంటి ముక్కు సూటి మనస్తత్వం ఉన్న హీరోను చూడలేదు అని అంటూ పవన్ తనతో నటించే హీరోయిన్స్ కు ఎంతో గౌరవాన్ని ఇస్తాడు అంటూ పవన్ ఆకాశానికి ఎత్తేసింది ఈ కన్నడ మందారం. 

పవన్ ‘సర్దార్’ ఐటమ్ సాంగ్ లోని మొట్టమొదటి పదాలు బయటకు వచ్చాయి కాబట్టి ఆ పదాలకు దేవిశ్రీ ప్రసాద్ ఎటువంటి మ్యాజిక్ చేసాడు అన్న ఆత్రుత అందరిలో ఉండటం సహజం. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సమ్మర్ పోటీకి రెడీ అవుతున్న సందర్భంలో ఇదే సమ్మర్ రేస్ ను టార్గెట్ చేస్తున్న అల్లుఅర్జున్ మహేష్ లకు లక్ష్మీరాయ్ చెప్పిన మాటలు కొంత గుబులు పుట్టిస్తాయి అనడంలో సందేహం లేదు..

0 comments:

Post a Comment