నందమూరి నటసింహం బాలక్రిష్ణ, మెగస్టార్ పై పంజా విసరబోతున్నాడు. ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఈ కథనంకి సంబంధించిన వివరాల్లోకి వెళితే, బాలక్రిష్ణ ప్రస్తుతం నటిస్తున్న 99వ చిత్రం డిక్టేటర్. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. దీంతో మూవీకి సంబంధించిన ప్రమోషన్ యాక్టివిటీస్ ని చిత్ర యూనిట్ వేగవంతం చేసింది. ముఖ్యంగా డిక్టేటర్ మూవీని బ్లాక్ బస్టర్ చేసే దిశగా చిత్ర యూనిట్ మొదటి నుండి కష్టపడుతూ వచ్చింది.
శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీపై, ఇప్పటికే ఇండస్ట్రీలో అంచనాలు పెరిగిపోయాయి. అలాగే ఫ్యాన్స్ సైతం ఈ మూవీపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఆడియో ఫంక్షన్ ని త్వరలోనే ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకు అమరావతి వేధికగా మారనుంది. డిసెంబర్20న ఈ వేడకని నిర్వహంచనున్నారు. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ రీ ఎంట్రి ఇస్తున్న ఈ సందర్భంలో, టాప్ హీరో అయిన బాలక్రిష్ణ వేగంగా సినిమాలను రిలీజ్ చేయటమే కాకుండా, సక్సెస్ ఫుల్ బ్లాక్ బస్టర్ లను సైతం అందుకుంటున్నాడు.
బాలక్రిష్ణ కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా, తను నటిస్తున్న ప్రతి చిత్రం బాక్సాపీస్ వద్ద సత్తా చాటుతూ వస్తుంది. ఈ మధ్య కాలంలో చిరంజీవి పేరు తెరపైకి ఎక్కువుగా వినిపిస్తున్న తరుణంలో, చిరంజీవికి చెక్ చెప్పేందుకు బాలయ్య తన మూవీలతో పకడ్భంధీగా ప్లానింగ్స్ చేస్తున్నాడు. ముఖ్యంగా అమరావతిలో తన బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇక డిక్టేటర్ మూవీని లక్ష మంది ఫ్యాన్స్ జనసమూహం మధ్యన ఆడియో వేడుకని ఘనంగా రిలీజ్ చేయబోతున్నాడు. ఈ వేడుకని రాజకీయ ప్రముఖలు సైతం హాజరుకానున్నారు. చిరంజీవి రీ ఎంట్రితో టాలీవుడ్ లో మళ్ళీ మెగా హావా నడవకుడదనే ప్లానింగ్ తో, బాలయ్య బాబు తన సత్తా చాటాలని చూడటం ఇక్కడ విశేషంగా మారిందని ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం.

0 comments:
Post a Comment