Thursday, 19 November 2015

చరణ్ కోసం ఆ ఇద్దరు

                                                               
తెలుగు చిత్ర పరిశ్రమలోకి మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ ‘చిరుత’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘మగధీర’ చిత్రం టాలీవుడ్ లో రికార్డుల మోత మోగించింది. ఈ సినిమాతో రాంచరణ్ ఎక్కడ లేని ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. దీంతో చెర్రీ తీసే ప్రతి సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. ఇక రాంచరణ్ ఫైట్స్, డ్యాన్స్ లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పాలు చేసుకున్నాడు. తర్వాత వచ్చిన నాయక్, రచ్చ,ఎవడు సినిమాలతో మాస్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఇక మెగాస్టార్ తనయుడు కాబట్టి భవిష్యత్ లో తండ్రి కి వచ్చినంత పేరుప్రఖ్యాతలు రావాలని ఆయన కుటుంబం నుంచే కాదు మెగా అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

ఈ మద్య శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ‘బ్రూస్ లీ’ చిత్రం చరణ్ కి పెద్ద రిమార్క్ తీసుకు వచ్చింది. వాస్తవానికి మగధీర చిత్రం సాధించిన విజయం తర్వాత ఆ రేంజ్ లో విజయాలు సాధించలేక పోతున్న చెర్రీకి ‘బ్రూస్ లీ’ సినిమా మరింత దెబ్బ తీసింది. దీంతో చెర్రీ తర్వాత సినిమా పై ప్రత్యేక శ్రద్ద వహించడానికి ఇద్దరు హేమా హెమీలు ఎంట్రీ ఇస్తున్నారు..ఆ ఇద్దరు ఎవరో కాదు ఒకరు మేనమామ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మరొకరు బాబాయి పవర్ స్టార్ పవన్ కళ్యాన్. వీరిద్ద‌రు కూడా మంచి ప్రాజెక్టులు వెతికి మ‌నోడికి భారీ బ్రేక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నార‌ని స‌మాచారం.

 ప్రస్తుతం రాంచన్, ఉపాసన ఇద్దరు విదేశాల్లో హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారు. తిరిగి వచ్చిన తర్వాత తమిళ వర్షన్ తనీ ఒరువన్ రీమేక్ లో నటిస్తాడంటూ వార్తలు వచ్చాయి. ఈ సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించ బోతున్నాడు. అయితే ఈ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాతగా ఉండాల్సి ఉన్నా.. లాస్ట్ మూవ్ మెంట్ లో అల్లు అరవింద్ ఈ ప్రాజెక్ట్ ను టేకోవర్ చేశారని సమాచారం. ఎందుకంటే నిర్మాతగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసిన అనుభవం ఉన్న అల్లు అరవింద్ ఈ సినిమాలను భారీ ఎత్తున  నిర్మించాలనుకుంటున్నారట

మరోవైపు పవన్ కళ్యాన్ కూడా చరణ్ తో సినిమా తీయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవలే చరణ్ తో నిర్మించబోయే సినిమాకు కథ కోసం వెతుకుతున్నాం అంటూ ప్రకటించిన పవన్ తనకు దగ్గర సన్నిహితుడైన త్రివిక్రమ్ చే దర్శకత్వం వహించాలని ప్లాన్ చేస్తున్నాడట. మొత్తానికి రాంచరణ్ భవిష్యత్ కోసం ఈ ఇద్దరు నడుంబిగించడం చూస్తుంటే మనోడికి మంచి భవిష్యత్ ఉండబోతున్నట్లు కనిపిస్తుంది. 

0 comments:

Post a Comment