టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగా హీరోల హావా నడుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగా హీరోల సంఖ్య పెరగటంతో ఎక్కడ చూసిన మెగా హీరోలకి సంబంధించిన షూటింగ్స్ కోలాహలమే కనిపిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా వరుణ్ తేజ్ నటించిన కంచె మూవీ బాక్సాపీస్ వద్ద సత్తాచాటడంతో, ఈ మూవీ తరవాత రిలీజ్ కాబోతున్న లోఫర్ మూవీపై అంచానాలు పెరగిపోతున్నాయి1
మొదటి రెండు సినిమాలైన ‘ముకుంద’, ‘కంచె’ సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మెగా హీరో వరుణ్ తేజ్, మూడో సినిమా అయిన ‘లోఫర్’ పై మార్కెట్ వర్గాల్లోనూ భారీ అంచానాలే క్రియేట్ అవుతున్నాయి. పూరి జగన్నాధ్ ఈ సినిమాలో వరుణ్ తేజ్ ని పక్కా మాస్ హీరోగా చూపించటమే కాకుండా, ఇది వరుణ్ తేజ్ నటించిన మొదటి కమర్షియల్ మూవీగా మారనుంది. ప్రస్తుతం షూటింగ్ పార్ట్ ని పూర్తి చేసుకున్న మూవీ, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను సైతం శరవేగంగా పూర్తి చేసుకుంటుంది.
ఇదిలా ఉంటే ఈ మూవీని డిసెంబర్ 18ని రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అలాగే సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఆడియోని డిసెంబర్ 7న రిలీజ్ చేయడానికి సిద్దమైంది. అయితే ఆ డేట్స్ లో మెగా హీరోలు ఎవ్వరూ ఆడియో ఫంక్షన్ కి అటెండ్ అయ్యే ఛాన్స్ కనిపించటం లేదనే టాక్స్ వినిపిస్తున్నాయి. కానీ, ఆ డేట్ బాగుంటంతో డిసెంబర్ 7నే ఆడియో రిలీజ్ ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుందట.
ఇక మెగా హీరోలు హాజరుకాని ఆడియో ఫంక్షన్ లో వరుణ్ ఒక్కడే ఆడియో వేడకని జరుపుకోవాలంటే కొద్దిగా కష్టంగానే ఉంటుందని అంటున్నారు. ఆడియో రిలీజ్ డేట్ ని మార్చాలని వరుణ్ తేజ్, పూరీని కోరుతున్నట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి మెగా హీరోలు ఎవ్వరూ డిసెంబర్ లో అందుబాటులో లేకపోవటంతో, వరుణ్ షాక్ కి గురైయ్యాడని అంటున్నారు.

0 comments:
Post a Comment