Thursday, 19 November 2015

చిరు కన్నా ఎన్టీఆర్ ఏ బెటర్ అనుకున్నాడా ?



తెలుగు ఇండస్ట్రీలో వివివినాయక్ అంటే మంచి దర్శకుడిగా పేరు ఉంది..ఈయన డైరెక్షనల్ ఏ హీరో అయిన నటించడానికి పోటీ పడుతారు. ఇక మెగాస్టార్ చిరంజీవి తన 150 వ చిత్రాన్ని వివివినాయక్ తో తీస్తున్నట్లు గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. అప్పట్లో పూరీ జగన్నాథ్ తో 150 వ చిత్రాన్ని ప్లాన్ చేసినప్పటికీ  కథలో సరైన బలం లేదని ఆ ప్రాజెక్టు క్యాన్సల్ చేసుకున్నారు. తర్వాత వివివినాయక్ తో తమిళంలో సూపర్ హిట్ అయిన ‘కత్తి’ చిత్రాన్ని రీమెక్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. చిరంజీవి కథ విషయంలో అస్సలు కాంప్రమేజ్ కావడంలేదట..ఆలా నాన్చుతూనే ఉండటంతో..  సినిమా ముందుకు సాగడం లేదు.

ఈ మద్య శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘బ్రూస్ లీ ’ సినిమా లో కొద్దిసేపు చిరంజీవి కనిపించాడు కానీ ఇది ఆ సినిమాకు ఏమీ ప్లస్ పాయింట్ కాలేదు అంటే చిరంజీవిపై మెగా అభిమానం తగ్గిందా అన్న డైలమాలో పడ్డారు చిరంజీవి. ఇప్పుడు ఫుల్ లెన్త్ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండాలని చూస్తున్నారట. అందుకే సరైన కథకోసం ఇప్పటికీ తర్జన భర్జన చేస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు వివివినాయక్ అక్కినేని నాగార్జున వారసుడి అక్కినేని అఖిల్ తో ఈ మద్య రిలీజ్ అయిన ‘అఖిల్’ సినిమాతో బాడా నిరుత్సాహ పడ్డారు. భారీ అంచనాల తో విడుదలైన ‘అఖిల్’ డివైడ్ టాక్ రావడంతో కాంట్రెవర్సీలో పడ్డాడు వివివినాయక్.

ఇప్పుడు చిరంజీవి 150వ సినిమా అవకాశం వస్తుందని ఎదురుచూస్తే విలువైన సమయం కోల్పోతానని గ్రహించినట్లు తెలుస్తోంది.  ఇక లాభం లేదనుకున్నాడో ఏమో కానీ గతంలో తన తో పనిచేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా తీయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఎన్టీఆర్ ‘టెంపర్ ’ సినిమాతో మంచి జోష్ లో ఉన్నాడు. దీంతో ఎన్టీఆర్ ఇమేజ్ కు తగిన విధంగా ఒక మంచి స్క్రిప్టును సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యాడట. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన  ‘అదుర్స్ ’ సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ అద్భుతంగా వచ్చాయి అందుకే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సారి కూడా పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఉండేలా సినిమా ప్లాన్ చేస్తున్నాడట.

0 comments:

Post a Comment