ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగాహీరో నటించబోతున్న 150వ చిత్రం హాట్ టాపిక్ గా వినిపిస్తుంది. దీనికి సంబందించిన వివరాల్లోకి వెళితే, తమిళంలో స్టార్ హీరో అజిత్, శృతి హాసన్ హీరోయిన్ గా శివ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘వెదాలం’. ఈ మూవీ దీపావళి కానుకగా రిలీజ్, రికార్డ్ లను బ్రేక్ చేస్తుంది. ప్రస్తుతం కోలీవుడ్ బాక్సాపీస్ ని షేక్ చేస్తుంది. నిజానికి వెదాలం మూవీ రెగ్యులర్ సిస్టర్ సెంటిమెంట్ సినిమా అయినప్పటికీ, తమిళ ఆడియన్స్ ని ఇది ఎంతగానో మెప్పించింది.
ఇదిలా ఉంటే ఈ మూవీని తెలుగులో ‘ఆవేశం’ అనే పేరుతో డబ్ చేసి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ, కోలీవుడ్ లో బాక్సాపీస్ రికార్డ్స్ ని తిరగరాయటంతో, తెలుగులోకి డబ్ చేయకుండా రీమేక్ చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్ కి చెందిన పలువురు నిర్మాతలు తెలుగులో రీమేక్ చెయ్యడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇందులో బడా ప్రొడ్యూసర్స్ చిరంజీవికి ఈ మూవీ బాగా సెట్ అవుతుందని భావిస్తున్నారంట.
అందుకు బాడా ప్రొడ్యూసర్స్ వేదాలం మూవీని చిరు చూడాల్సిందిగా ప్రత్యేకంగా కోరారు. అందుకు చిర సైతం మొదట ఓకే అన్నట్టగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ, తరవాత మాత్రం వేదలం మూవీ మూవీని చూసే ఉద్ధేశం కానీ, ఆ మూవీని రిమేక్ చేసే ఉద్ధేశం కానీ లేదన్నారంట. దీంతో చిరంజీవిపై ఆశలు పెట్టుకున్న నిర్మాతలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే అజిత్ రేంజ్ లో యాక్షన్ చేయగల హీరో ఒక్క ఎన్టీఆర్ అనే అందరూ భావిస్తున్నారు.
దీంతో ప్రస్తుతం వేదాలం రిమేక్ ఎన్టీఆర్ టేబుల్ వద్దకు వచ్చిందని అంటున్నారు. ఎన్టీఆర్ కి ఈ మూవీ బాగా యాప్ట్ అవుతుందని చాలా మంది అంటున్నారు. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో నాన్నకు ప్రేమతో మూవీ పనుల్లో బిజిగా ఉన్న ఎన్టీఆర్, త్వరలోనే వేదాలం మూవీని చూసి...ఓ నిర్ణయాన్ని తీసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు.

0 comments:
Post a Comment