మెగాహీరోయిన్ నిహారికా తన మొదటి మూవీతోనే టాప్ హీరోయిన్ రేంజ్ లో పాపులారిటిని సంపాదించుకుంది. మెగా ఫ్యామిలీలో ఇప్పటి వరకూ చాలా మంది హీరోలు ఉన్నప్పటికీ, మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా వచ్చిన మొదటి హీరోయిన్ గా నిహారిగా పేరు సంపాదించుకుంది. మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు కుమార్తె నిహారిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి, ఆ గ్యాప్ ని సైతం పూర్తి చేసింది.
టీవీ 9 సంస్థతో కలిసి ప్రముఖ దర్శక నిర్మాత మధుర శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా, తాజాగా సెట్స్ పైకి వెళ్ళింది. ఇక ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళటమే కాకుండా, మూవీకి సంబంధించిన ఒక్కో హైలెట్ బయటకు వస్తుంది. ‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’ వంటి అందమైన ప్రేమకథా చిత్రాన్ని అందించిన రామరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ జానర్లో రూపొందుతోన్న ఈ సినిమాలో తాజాగా ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడనే విషయం తెలిసిందే.
దీంతో ఈ మూవీ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ వార్త హాట్ టాక్స్ గా ఉండగానే, మరో క్రేజీ యాక్టర్ ఇందులో నటస్తున్నాడంటే టాక్స్ వినిపిస్తున్నాయి. ప్రకాష్ రాజ్ తో పాటు స్టార్ హీరో జగపతిబాబు సైతం ఈ సినిమాలో ఓ కీ రోల్‌లో నటించనున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అయితే చిత్ర యూనిట్ అధికారికంగా ఇంకా బయటకు చెప్పటం లేదు.
ప్రకాష్ రాజ్, జగపతి బాబు తో మరో ప్రముఖ తారాగణం సైతం ఇందులో నటించనున్నారంట. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుండి వస్తున్న ఒక్కొక్క స్పెషల్ కాస్టింగ్ డిటైల్స్, అందరిలోనూ ప్రత్యేకమైన ఆసక్తిని కలిగిస్తుంది.

0 comments:
Post a Comment