రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ షాక్ నుండి ఇంకా తేరుకోకుండానే మెగా స్టార్ చిరంజీవికి జూనియర్ నుండి అనుకోని షాక్ తగిలింది అన్న వార్తలు వస్తున్నాయి. గతవారం దీపావళికి విడుదలైన ‘వేదాలం’ సినిమా ఘన విజయం సాధించి కలక్షన్స్ వర్షం కురిపిస్తున్న నేపధ్యంలో ఈసినిమా తెలుగు రీమేక్ పై టాలీవుడ్ టాప్ హీరోల దృష్టి పడింది అన్న వార్తలు ఇప్పటికే వచ్చాయి.
ఈసినిమాను తన 150వ సినిమాగా చిరంజీవి తాను నటిస్తే ఎలా ఉంటుంది అని తన సన్నిహితులతో ఇప్పటికే చర్చలు మొదలు పెట్టినట్లు వార్తలు కూడ వచ్చాయి. అయితే చిరంజీవి ఇలాంటి ఆలోచనలు చేస్తూ రోజులు గడుపుతున్న నేపధ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈసినిమా పై కన్నేయడమే కాకుండా ఏకంగా ఈసినిమా రైట్స్ ను కొనమని తన సన్నిహితులకు చెప్పడమే కాకుండా ఇద్దరు నిర్మాతలను ఇప్పటికే ఈ విషయమై రంగంలోకి దించినట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ అనుకోని ట్విస్ట్ కు చిరంజీవి కూడ షాక్ అవ్వడంతో తన సన్నిహితులు ఇద్దరిని ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం చెన్నై పంపించాడని టాక్. దీనితో తమ ‘వేదాలం’ సినిమా రైట్స్ కు మెగా స్టార్ – యంగ్ టైగర్ ల మధ్య పోటీ ఏర్పడటంతో ఈసినిమా నిర్మాతలు షాక్ అవ్వడమే కాకుండా ఈసినిమా రీమేక్ రైట్స్ మొత్తాన్ని చాల భారీగా పెంచారని వార్తలు వస్తున్నాయి.
అంతేకాదు ఈసినిమా విషయంలో మొట్టమొదట చిరంజీవి ఆ శక్తి చూపించాడు కాబట్టి మెగా స్టార్ నుండి ఒక స్పష్టమైన నిర్ణయం వచ్చిన తరువాత జూనియర్ ఆఫర్ గురించి ఆలోచిస్తాము అని ఈసినిమా నిర్మాతలు అన్నట్లు ఫిలింనగర్ టాక్. టాలీవుడ్ ను కొన్ని దశాబ్దాలు శాసించిన చిరంజీవికి జూనియర్ నుండి పోటీ రావడం ఇప్పుడు షాకింగ్ న్యూస్ గా మారింది. మరి ఇలాంటి పరిస్థుతులలో ఈ ‘వేదాలం’ ఎవర్ని వరిస్తుందో చూడాలి..

0 comments:
Post a Comment