పవన్ కళ్యాణ్ పేరును అతడి డైలాగ్ లను వాడుకోవడం ఇప్పుడు ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. టాలీవుడ్ యంగ్ హీరోల నుండి టాప్ హీరోయిన్స్ వరకు ఎదో ఒక సందర్భంలో అవకాశం దొరికితే చాలు పవన్ నామస్మరణ చేస్తూ పవన్ ను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే ఒక సందర్భంలో అల్లుఅర్జున్ పవన్ క్రేజ్ గాలిలో కూడ ఉంది అంటూ పవన్ పై కామెంట్ చేసాడు.
ఇక నితిన్ లాంటి హీరోల విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ప్రస్తుతం హాట్ యాంకర్ గా పేరుగాంచి సినిమాస్టార్ గా మా1రిపోయిన అనసూయ, రీసెంట్ గా జరిగిన ‘కుమారి 21ఎఫ్’ ఆడియో ప్లాటినం డిస్క్ ఫంక్షన్ లో ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనుక్షణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఇమిటేట్ చేస్తూ మీడియా కెమెరాలకు ఇచ్చిన ఫోజులు ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి.
మెడ వెనక్కు చెయ్యి పెట్టుకుని ఓరగా చూడ్డం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టయిల్. ఆ మధ్య జరిగిన మెగాస్టార్ షష్టిపూర్తి సందర్భంగా కూడ ఇటువంటి లుక్ తో పవన్ హడావిడి చేసాడు. పవన్ కు అనుకోకుండానే అలా చెయ్యి అతడి మెడ వెనక్కి వెళ్ళిపోతుందా అని చాలామందికి అనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పవర్ స్టార్ ట్రేడ్ మార్క్ స్టయిల్ గా ఇది మారిపోయింది. ఇప్పుడు అదే స్టైల్ ను అనసూయ అనుసరించడం అందర్నీ ఆశ్చర్య పరిచింది.
పవన్ పై తన అభిమానాన్ని ఇప్పటికే అనేక సార్లు వ్యక్తం చేసిన అనసూయ ప్రస్తుతం ఇలా పవన్ స్టైల్ ను కూడ ఇమిటేట్ చేస్తూ పవన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయిందా అనే సెటైర్లు ఆ కార్యక్రమానికి వచ్చిన చాలామంది అనసూయ పై వేసారు. ఇప్పటికే నాగార్జునతో నటిస్తున్న అనసూయ రానున్న రోజులలో తాను పవన్ తో కూడ నటిస్తాను అని చెప్పడానికి ఇలాంటి ప్రయత్నాలు చేసి ఉంటుంది..

0 comments:
Post a Comment