రాజమౌళి ఏదైనా సినిమాను ప్రశంసించాడు అంటే ఆ సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడుతోంది. దీనితో చాలామంది దర్శక నిర్మాతలు తాము తీసే సినిమాలను రాజమౌళి దృష్టిలో పడేలా చేస్తున్నారు. ఈ పరిస్థుతులు ఇలా ఉండగా ‘బ్రూస్ లీ’ షాక్ నుండి తేరుకోవడానికి ప్రస్తుతం అమెరికాలో రిలాక్స్ అవుతున్న చరణ్ కు రాజమౌళి ఊహించని షాక్ ఇచ్చాడు.
చరణ్ త్వరలో నటించబోతున్న ‘ధని వొరువన్’ పై కామెంట్స్ చేసాడు రాజమౌళి ‘చాల ఆలస్యంగా ఈమధ్యనే ధని వొరువన్’ సినిమాను చూసాను. అరవింద్ స్వామి నటన నా మైండ్ ను బ్లాoక్ చేసింది. కమర్షియల్ సినిమాలకు భిన్నంగా దర్శకుడు మోహన్ రాజ అద్భుతంగా తీసిన టెక్నిక్ నాకు ఎంతో నచ్చింది.’ అంటూ ట్విట్ చేసి చరణ్ నటించబోతున్న ఈసినిమా రీమేక్ కు ఇంకా షూటింగ్ ప్రారంభం అవ్వకుండానే క్రేజ్ ను పెంచాడు.
ఇప్పటి వరకు ఈ సినిమా రీమేక్ విషయంలో చరణ్ కు ఉన్న భయాలు రాజమౌళి లేటెస్ట్ ట్విట్ తో తీరిపోతాయి అనుకోవాలి. అయితే చరణ్ దృష్టిలో అరవింద్ స్వామి పాత్రను మరో టాలీవుడ్ టాప్ హీరోతో చేయించాలి అని ఆలోచనలు వస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో రాజమౌళి అరవింద్ స్వామి పై కురిపించిన ప్రశంసలతో చరణ్ ఆలోచనలు మళ్ళీ మారతాయా అనే అనుమానాలు కూడ ఉన్నాయి.
ఇలాంటి పరిస్థుతులలో ఈ సినిమా రీమేక్ కు సంబంధించి మరొక ఆ శక్తికర న్యూస్ ఫిలింనగర్ లో హడావిడి చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రీమేక్ ను అల్లుఅరవింద్ నిర్మిస్తున్నట్లుగా వార్తలు వస్తున్న నేపధ్యంలో చరణ్ ‘బ్రూస్ లీ’ పరాజయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాకు తన మామయ్య నుండి పారితోషికం తీసుకోకుండా ఈసినిమాకు జరిగే బిజినెస్ లో షేర్ తీసుకోబోతున్నాడు అని టాక్. జనవరి నుండి ప్రారంభం కాబోతున్న ఈసినిమాను త్వరగా పూర్తి చేసి తన ‘బ్రూస్ లీ’ పీడకలను త్వరగా మరిచిపోవాలని చరణ్ చేస్తున్న ప్రయత్నాలకు రాజమౌళి లేటెస్ట్ ట్విట్ చరణ్ కు కొండంత అండగా మారుతుంది అనడంలో సందేహం లేదు..

0 comments:
Post a Comment