Thursday, 12 November 2015

పవన్ కాన్వాయ్ కి ప్రమాదం

                                                                         
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల సమయంలో సినీ నటుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాన్ ప్రత్యక్షంగా నిలబడలేదు కానీ టీడీపీ, బిజెపికి మాత్రం చాలా సపోర్ట్ చేశారు. ఆ పార్టీ తరుపు నుంచి ప్రచారాలు కూడా చేశారు. ‘కాంగ్రెస్ కో హటావో..దేశ్ కో బచావో’ అన్నినినాదంలో ప్రజల్లోకి వెళ్లారు. మొత్తానికి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ పరిపాలన చేపట్టాయి. అప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోడి కి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితులు అయ్యారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్.

ఈ నేపథ్యంలో గురువారం పవన్ కళ్యాన్ చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. అయితే పండుగ సందర్భంగా దీపావళి శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్తున్నట్లు అలాగే వారి మధ్య పలు అంశాలు చర్చకు వస్తున్నాయని తెలుస్తోంది. ఈ భేటీ మధ్యాహ్నం రెండు గంటల వరకు సాగనుందని సమాచారం. గ్రేటర్ హైదరాబాద్, భూసమీకరణ అంశాలతో పాటు సామాజిక వర్గాల అంశం కూడా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది.  అయితే పవన్ కళ్యాన్ కాన్వాయ్ కి స్వల్ప ప్రమాదం జరిగింది..  గన్నవరం నుంచి కాన్వాయ్ సీఎం కార్యాలయానికి వెళుతుండగా.. రమేష్ అసుపత్రి సమీపంలో కాన్వాయ్ పైలట్ వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఎవరికైనా గాయాలు అయ్యాయా అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే పవన్ కల్యాణ్ కి మాత్రం ఏమి కాలేదు . ప్రమాదం అనంతరం పవన్ కల్యాణ్ కాన్వాయ్ సీఎం ఆఫీస్ వైపు వెళ్ళింది. చంద్రబాబును కలిసిన పవన్ కళ్యాణ్ కలిశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో వీరి భేటీ జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. అంతే కాదు క్యాంప్ ఆఫీసు వద్ద చంద్రబాబు వాహనం ఉండాల్సిన స్థలంలో పవన్ కళ్యాణ్ వాహనాన్ని పార్క్ చేయించారు. భేటీ అనంతరం పవన్ వెళ్లే సమయంలో.. కారు వరకు వచ్చి పవన్‌కు చంద్రబాబు వీడ్కోలు పలికారు. 

0 comments:

Post a Comment