కమెడియన్ టర్న్ హీరో సునీల్ కొత్త సినిమా "జక్కన". వరుస ప్లాప్ లతో సతమతమవుతున్నసునీల్ ఈ మూవీ పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ మధ్య విడుదల చేసిన ఈ మూవీ టీజర్ కు మిశ్రమ స్పందన వచ్చింది. రామ్ గోపాల్ వర్మ శిష్యుడు వంశీ కృష్ణ ఆకెళ్ళ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఆడియోని ఈ నెల 24వ తేదీన హైద్రాబాద్ లోని విడుదల చేయనున్నారు. ఐతే ఈ ఆడియో విడుదల చిరంజీవి చేతులమీదుగా జరపాలని సునీల్ అనుకున్నాడట. అనుకున్నదే తడవుగా అన్నయ్య అంటూ చిరు దగ్గర తన కోరిక వెల్లడించటం తో చిరు కూడా రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ ఫంక్షన్ పూర్తి చేసుకుని ఆ రాత్రికి చిరు తన "కత్తిలాంటోడు" షూటింగ్ లో పాల్గొంటారు.

0 comments:
Post a Comment