మెగాస్టార్ చిరంజీవి నటించ బోయే 150 వ చిత్రానికి పూరి జగన్నాద్ దర్శకత్వం వహించనున్నారని ఆయన తనయుడు రామ్ చరణ్ తేజ్ తన పేస్ బుక్ అకౌంట్ ద్వారా తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో చిరు సరసన నయన తార ను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో నటించేందుకు కొంతమంది సీనియర్ హీరోయిన్ పేర్లను పరిశీలించి నప్పటికీ, చిరు, పూరి మాత్రం నయన తార వైపు మొగ్గు చూపారని వినికిడి. అంతేకాకుండా ఈ చిత్రంలో మెగా ఫ్యామిలీ లోని కుటుంబ సభ్యులు అందరూ కూడా అతిధి పాత్రల్లో కనిపించేలా స్క్రిప్ట్ ను ఈ పాటికే సిద్దం చేసినట్లు సమాచారం. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రానున్న సంక్రాంతికి విడుదల చేసేలా ప్రణాళిక పూర్తి అయినట్లు తెలుస్తోంది. చిరు పుట్టిన రోజు అయిన ఆగష్టు 22 న చిత్ర షూటింగ్ ఆరంభించి, డిసెంబర్ నెలాఖరు కల్లా చిత్రాన్ని పూర్తి చేయాలని పూరి లక్ష్యంగా పెట్టుకున్నారట. ఒకవేళ తెలుగు వారి పెద్ద పండుగ అయిన సంక్రాంతికి చిరు చిత్రం విడుదల అయితే ఆయన అభిమానులకు నిజంగా అది పెద్ద పండుగే అవుతుంది అనడం లో ఏమాత్రం సందేహం లేదు.

0 comments:
Post a Comment