ఒక సాధారణ పౌరుడి వివాహం జరుగుతుంది అంటేనే… ఎంతో హడావుడి, హంగామా ఉంటుంది. అటువంటిది ప్రధాని వివాహం అంటే ఇంకెంత హడావుడి ఉండాలి.. మీడియా ఆ వివాహానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తుంది. ప్రజల ఆ వివాహం కోసం ఎంతగా ఎదురుచూస్తారు.. అయితే, ఇక్కడ అందుకు విరుద్దంగా జరుగుతున్నది. ప్రధాని పెళ్లి గురించి ఆయన కంటే, అక్కడి ప్రతిపక్షాలు ఎక్కువగా ప్రచారం చేస్తున్నాయి. ఎందుకు ప్రతిపక్షాలు అంతగా ప్రచారం చేస్తున్నాయి అంటే అందుకు బలమియా కారణం ఉన్నది. ఇక వివరాలలోకి వెళ్తే…
జేవియర్ బెటెల్ 2013 డిసెంబర్ లో లక్సెంబర్గ్ ప్రధానిగా ఎంపికయ్యారు. కాగా, ఆయన ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు. అదీ తన సహచరుడ్ని. ప్రధాని కాకముందునుంచే జేవియర్ తన సహచరుడితో సహజీవనం చేస్తున్నారు. ఒక మగవాడిని మరో మగవాడు పెళ్లి చేసుకోవడం ఏమిటని ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయి. ప్రధాని హోదాలో ఉన్న ఓ వ్యక్తీ గే వివాహం చేసుకోవడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. జేవియర్ ప్రధాని అయ్యాక లక్సెంబర్గ్ లో ఎల్జీబీటి హక్కుల పరిరక్షణకోసం అనేక చర్యలు చేపట్టారు జేవియర్. ఇక ప్రపంచ ప్రఖ్యాత మ్యాగజైన్ ఈ పెళ్లిని కవర్ చేసేందుకు సిద్దమయింది. అయితే, ఇది తన సొంత విషయం అని, దీనికి ప్రచారం అవసరం లేదని జేవియర్ చెప్పినట్టు తెలుస్తున్నది.

0 comments:
Post a Comment