Saturday, 2 May 2015

పండక్కి పవన్ కళ్యాణ్

ఇంకా సినిమానే ప్రారంభం కాలేదు కానీ షూటింగ్ అంతా పూర్తిచేసి సంక్రాంతికి గబ్బర్ సింగ్ 2సినిమా రిలీజ్ అని అంటున్నారు నిర్మాత శరత్ మరార్ . ఈ నెలలో షూటింగ్ ప్రారంభించి సంక్రాంతి కి రిలీజ్ చేయాలనీ వాళ్ళ ప్లాన్ అట . ఇప్పటివరకు ఇలాంటివి బోలెడు చెప్పారు ,సంపత్ నంది దర్శకత్వంలో ప్రారంభోత్సవం కూడా చేసారు కానీ తీరా సమయానికి ఆ సినిమా నుండి సంపత్ ని తప్పించి రవితేజ తో పవర్ చిత్రాన్ని తీసిన బాబీ కి దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు . అనీషా అంబ్రోస్ ని కథానాయికగా ఎంపిక చేసారు కూడా మరో హీరోయిన్ ని ఎంపిక చేయాల్సి ఉంది . అయితే ఇప్పటికే చాలాసార్లు అదిగో గబ్బర్ ఇదిగో గబ్బర్ అన్నారు కాబట్టి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే వరకు నమ్మేలా లేరు అభిమానులు 

0 comments:

Post a Comment