Saturday, 2 May 2015

బాహుబాలి పోస్టర్ కాపీ అట

నిన్న రాజమౌళి రిలీజ్ చేసిన బాహుబలి పోస్టర్ ఓ హాలీవుడ్ చిత్రం లోనిదని దాన్ని కాపీ చేసి మనకు చూపిస్తున్నారని నెటిజన్లు గోల గోల చేస్తున్నారు . మే 1నుండి మే 31 వరకు బాహుబలి మాసం అంటూ రోజుకొక ప్రచార చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసిన విషయం విదితమే . కాగా అందులో భాగంగా నిన్న జక్కన్న రిలీజ్ చేసిన పోస్టర్ పై అప్పుడే విమర్శలు వస్తున్నాయి . కొంతమంది ఈ పోస్టర్ ని చూసి బాగుందని మెచ్చుకుంటున్డగా మరికొందరు నెటిజన్లు మాత్రం ఇది హాలీవుడ్ చిత్రం లోని స్టిల్ అని దాన్ని కాపీ కొట్టి మనకు చూపిస్తున్నాడని విమర్శలు చేస్తున్నారు . అయితే రాజమౌళి ప్రతీ చిత్రానికి ఇలా కాపీ అంటూ ప్రచారం జరగడం మామూలే అయ్యింది . 

0 comments:

Post a Comment