Wednesday, 13 May 2015

హీరోయిన్లు లేరు.. అందరూ ఐటెంలే!

ప్రముఖ దర్శకుడు, నటుడు, మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణరావు రవీంద్రభారతిలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తూ తెలుగు చలన చిత్ర కదానాయికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన తెలుగు చిత్రసీమలో ఒక్కరూ సరైన కధానాయిక లేరంటూ తేల్చి చెప్పారు. అలాగే టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న హీరోయిన్లు నటీమణులు కాదని, అందరూ ఐటెం భామలేనని దాసరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ ఇంతకు ముందు ఐటెం పాటల కోసం సిల్క్ స్మిత, డిస్కో శాంతి మొదలగు తారలు ఉండేవారని ఇప్పుడు ఆ అవసరం లేకుండా హీరోయిన్లే ఐటెం సాంగ్ లకు రెడీ అయిపోతున్నారని విమర్శించారు. అలాగే ప్రస్తుతం ఏ హీరోయిన్ కూడా ఐదేళ్ళకు మించి ఇండస్ట్రీలో ఉండలేకపోతున్నారని దాసరి ఎద్దేవా చేశారు. ఇక టాప్ రేంజ్ లో ఉన్న కధానాయికలు సైతం ఐటెం సాంగ్ ల వైపే మొగ్గు చూపుతున్నారని దాసరి నారాయణరావు పేర్కొన్నారు.

0 comments:

Post a Comment