కమల్ హాసన్ తో దశావతారం ,విక్రమ్ తో అన్నియన్ ,ఐ వంటి చిత్రాలను భారీ ఎత్తున నిర్మించిన ఆస్కార్ రవిచంద్రన్ చిక్కుల్లో ఉన్నాడు . ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో తన ఆస్థులను తాకట్టు పెట్టి లోన్ తీసుకొని చిత్రాల నిర్మాణం పూర్తిచేసి సకాలంలో డబ్బు చెల్లించక పోవడంతో సదరు బ్యాంక్ కి బకాయి పడ్డ 97కోట్ల కింద రవిచంద్రన్ ఆస్థులను జప్తు చేసింది . అప్పు తోసహ 97కోట్లను సకాలంలో చెల్లించక పోయినప్పటికీ మరికొంత గడువు ఇస్తే ఆ డబ్బు చెల్లిస్తామని అంటున్నారు ఆస్కార్ ఫిల్మ్స్ సంస్థ వాళ్ళు . మరి దీనికి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఒప్పుకున్తుందా లేదా చూడాలి . ఎన్నో సంచలన విజయాలను అందించిన్ ఆస్కార్ రవిచంద్రన్ అప్పుల్లో కూరుకు పోవడం శోచనీయమే . ఇటీవల రవించద్రన్ నిర్మించిన ఐ అందరినీ నిరాశపరిచింది .

0 comments:
Post a Comment