మన దేశంలో అందునా మన దక్షినాది లో సెంటిమెంట్ ఎక్కువ ఇక సినిమా రంగంలో మరీనూ . బాలకృష్ణ సరసన నటించిన ఇద్దరు హీరోయిన్ లు పెళ్లి చేసుకోవడానికి రెడీ అయి తీరా పెళ్లి జరుగుతుంది అన్న సమయానికి వాళ్ళ పెళ్ళిళ్ళు ఆగిపోయాయి . ఇది యద్రుచ్చికమే అయినప్పటికీ రెండు సంఘటనలు జరగడం వల్ల కొంతమంది ఈ వాదన తెరపైకి తెచ్చారు . ఇంతకీ పెళ్ళిళ్ళు ఆగిపోయిన ఇద్దరు ముద్దుగుమ్మలు ఎవరా అంటే ఒకరు నయనతార కాగా మరొకరు త్రిష . బాలయ్య తో నయనతార శ్రీరామరాజ్యం చిత్రం లో నటిస్తున్నప్పుడే ఇక సినిమాలకు గుడ్ బై చెబుతున్నానని ప్రభుదేవా ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిన తర్వాత ఆ సినిమా రిలీజ్ కాకుండానే వాళ్ళ పెళ్లి అర్దాంతరంగా ఆగిపోయింది , ఇక త్రిష సంగతి అంతే బాలయ్య తో లయన్ సినిమా చేస్తున్నప్పుడే త్రిష -వరుణ్ మనియన్ ల వివాహ నిశ్చితార్దం జరిగింది . ఇక లయన్ రిలీజ్ అవుతున్న సందర్భంగా త్రిష పెళ్లి పెటాకులు అయ్యాయని త్రిష తల్లి పేర్కొన్న విషయం తెలిసిందే . దాంతో బాలయ్య తో నటిస్తున్న సమయంలో హీరోయిన్ పెళ్లి అనుకుంటే అది కాదని అందుకు ఉదాహరనే ఈ ఇద్దరి పెళ్ళిళ్ళు ఆగిపోవడం అని ఓ ప్రచారం మొదలు పెట్టారు.

0 comments:
Post a Comment