Friday, 8 May 2015

వరుస సినిమాలతో జోరు మీదున్న హాట్ బామ

చేసినవి తక్కువ సినిమాలే అయినా ఈ అమ్మడికి మాత్రం మంచి క్రేజ్ ఉంది. వరుసగా క్రేజీ సినిమాల్లో అవకాశాలు కొట్టేస్తూ ఇతర హీరోయిన్స్ కు పోటిగా మారింది. ఇంతకీ ఆ భామ ఎవరా ? అనే కదా మీ డౌట్ ! ఆమె ఎవరో కాదు కోలీవుడ్ లేటెస్ట్ క్రేజీ గర్ల్ లక్ష్మి మీనన్. గుమ్కి ( తెలుగులో గజరాజు ) సినిమాతో కోలీవుడ్ లోకి ఎంట్రీ  ఇచ్చిన ఈ చిన్నదానికి మొదటి సినిమానే మంచి బ్రేక్ ఇచ్చింది. కమర్షియల్ గా ఎలా ఉన్న హీరోయిన్ గా నిలబడేలా ఆ సినిమా గుర్తింపు తెచ్చింది. ఆ తరువాత వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం మరో అవకాశాన్ని కొట్టేసింది. సామి దర్శకత్వం లో రూపొందే ఈ సినిమాలో హీరోయిన్ గా ఓకే అయ్యింది. పెన్ సామి పేరుతొ రూపొందే ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుంది. సో మొత్తంగా ఈ అమ్మడు లక్కి గర్ల్ అని అంటున్నారు కోలీవుడ్ జనాలు. 

0 comments:

Post a Comment