Tuesday, 23 June 2015

మెగా హీరోల మద్య పోటీ తప్పదా

మెగా హీరోలైన రామ్ చరణ్ తేజ్ ,నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ల మద్య దసరా కు భీకర పోరు సాగనుందా అంటే ప్రస్తుత పరిస్తితులైతే అవుననే అంటున్నాయి . ఎందుకంటే చరణ్ ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఆ చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేయడానికి ముందుగానే ప్లాన్ చేసుకున్నారు కాగా పూరి జగన్నాద్ కాంబినేషన్ లో వరుణ్ నటించబోయే లోఫర్ షూటింగ్ జూలై నుండి జరుగనుంది కాగా ఆ చిత్రాన్ని కూడా దసరా కే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు . దాంతో ఇద్దరు మెగా హీరోలు అందునా అన్నాదమ్ములు అయిన చరణ్ - వరుణ్ ల మద్య భీకర పోరు సాగడం ఖాయం . అయితే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు రాజీ పడక తప్పదు ఎందుకంటే ఒకేసారి ఇద్దరి చిత్రాలు వస్తే మెగా అభిమానులకు ఇబ్బంది తప్పదు కాబట్టి నాగబాబు చొరవ తీసుకొని ఆ పోటీ తప్పించి మార్గాన్ని సుగమం చేస్తాడో లేక పోటీ లోకి దింపుతాడో చూడాలి . 

0 comments:

Post a Comment