Tuesday, 23 June 2015

మెగా తనయుడు బ్యానర్ పేరు అదే మరి

మెగా తనయుడు రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ జోరుగా జరుగుతుంది. శ్రీను వైట్ల దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమా తరువాత చరణ్ మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమాను తానే నిర్మిస్తానని చెప్పిన విషయం తెలిసిందే. అయితే రామ్ చరణ్ నిర్మించే బ్యానర్ కు ఎ పేరు పెడతారా అనే అనుమానాలు ఉండేవి ? నిజానికి సురేఖ మూవీస్ , లియో ప్రొడక్షన్స్  లేదా ఉపాసన ఎంటర్ టైన్మెంట్ అనే పేర్లలో ఏదో పెడతారని అనుకున్నారు అందరు ? కాని ఆ బ్యానర్ పేరుని చరణ్ నిర్ణయించాడని మెగా వర్గాల సమాచారం . ఈ బ్యానర్ కు రామ్ చరణ్ ఎంటర్ టైన్మెంట్ అనే పేరును డిసైడ్ చేసారట ? సో చరణ్ కూడా పవన్ , మహేష్ లను ఫాలో అవుతున్నాడు మరి ?

0 comments:

Post a Comment