బాహుబలి సీక్రెట్స్
బాహుబలి సినిమాకు సంబంధించి అఫీషియల్ ప్రమోషన్ ప్రారంబించాడు రాజమౌళి. టీవీ ఛానెల్స్, పత్రికలకు ఇంటర్వ్యూలు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. బాహుబలికి సంబంధించి ఇప్పటికే ఎన్నో విశేషాల్ని తన ట్విట్టర్, ఫేస్ బుక్ పేజ్ ద్వారా వివరించిన రాజమౌళి.. ఇప్పుడు తెరవెనక మరిన్ని సంగతుల్ని ప్రేక్షకులకు అందిస్తున్నాడు. వాటిలో కొన్ని ఇప్పుడు చూద్దాం.
1. బాహుబలి సినిమాకు ప్రేరణ అమర్ చిత్రకథ. ఈ కామిక్ సిరీస్ నుంచి స్ఫూర్తిపొందే బాహుబలి సినిమాను తెరకెక్కించానని ప్రకటించాడు రాజమౌళి. దీంతోపాటు సినిమాలో మహాభారతం ఛాయలు, పాత్రలు కూడా కనిపిస్తాయని చెబుతున్నాడు.
2. బాహుబలి పార్ట్-2కు రానా రచయితగా వ్యవహరిస్తాడని చెప్పుకొచ్చాడు రాజమౌళి. రానాలో మంచి రచయిత ఉన్నాడని, బాహుబలి పార్ట్-1 షూటింగ్ అయిపోయిన తర్వాత రానా రాసిన ఉత్తరం అందర్నీ కదిలించిందని చెప్పుకొచ్చాడు.
3. అనుష్కను కేవలం ఓ హీరోయిన్ గా మాత్రమే చూడనని స్పష్టంచేశాడు రాజమౌళి. బొమ్మాళిని తమ కుటుంబంలో ఓ సభ్యురాలిగా ప్రకటించాడు. ఆమెతో మరిన్ని సినిమాలు చేస్తానని ప్రకటించాడు.
5. తన డ్రీమ్ ప్రాజెక్ట్ బాహుబలి కాదని ప్రకటించాడు రాజమౌళి. ఎప్పటికైనా మహాభారతాన్ని తెరకెక్కిస్తానంటున్నాడు.
6. సెట్స్ పైకి వెళ్లి, కొంతభాగం షూటింగ్ చేసి, ఆ తర్వాత ఎడిటింగ్ చేస్తున్న టైమ్ లోనే బాహుబలిని రెండు భాగాలు తీయాలనిపించిందన్నాడు రాజమౌళి. ఒకే సినిమాలో మొత్తాన్ని ఇరికించి చూపించడానికి ఇష్టంలేకే రెండు భాగాలుగా విడగొట్టామని స్పష్టంచేశాడు.
ఇలా బాహుబలికి సంబంధించి ఎన్నో సంగతుల్ని మీడియాతో పంచుకున్నాడు జక్కన్న.
0 comments:
Post a Comment