Tuesday, 7 July 2015

బాహుబ‌లి హిట్ట‌వ్వ‌కుంటే.. ఇండ‌స్ట్రీ ఫ‌ట్టే!


బాహుబ‌లి సినిమా హిట్ట‌వ్వాలి దేవుడా.. ఇదే ఇప్పుడు ఇండ‌స్ట్రీలో వాళ్లు వీళ్లు అనే భేదం లేకుండా అంద‌రూ కోరుకుంటున్న‌ది. టాలీవుడ్ చ‌రిత్ర‌లో గ‌తంలో ఎన్న‌డూ లేనంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా అమ్మ‌కాలు కూడా క‌నీవినీ ఎరుగ‌ని రేట్ల‌కు జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. దాదాపు సినిమా ట్రేడ్‌లో ఉన్న‌వారంతా ఈ సినిమాపై పెట్టుబ‌డి పెట్టిన‌ట్టు తెలుస్తోంది.
ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు ఉండ‌టంతో.. బ‌య్య‌ర్లు భారీ రేట్ల‌కు కొంటే.. కిందిస్థాయి బ‌య్య‌ర్లు, ఎగ్జిబిట‌ర్లు, థ‌ర్డ్ పార్టీల వాళ్లు ఒక్కో సెంట‌ర్‌కి భారీ ధ‌ర‌లు పెట్టి కొనుగోలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినీ వ్యాపారుల డ‌బ్బంతా ఈ సినిమాపై పెట్టుబ‌డి పెట్టిన‌ట్టు తెలుస్తోంది.
ఇప్పుడు ఈ సినిమా పెద్ద హిట్ అయితే త‌ప్ప దీనిపై వీరంతా పెట్టిన పెట్టుబ‌డి వ‌చ్చే అవ‌కాశం లేదు. ఇక లాభాలు రావాలంటే మాత్రం బ్లాక్ బస్ట‌ర్ కావాల్సిందే. ఈ సినిమా అటో ఇటో అయితే.. బ‌య్య‌ర్లు కోలుకోలేక‌పోవ‌డ‌మే కాదు.. ఇప్ప‌ట్లో పెద్ద సినిమాల‌ను కొన‌డానికి ఎవ‌రూ ముందుకొచ్చే అవ‌కాశ‌ముండ‌దు. అందుకే ఈ సినిమా హిట్ట‌వ్వాల‌ని వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా అందరూ కోరుకుంటున్నారు.

0 comments:

Post a Comment