బాహుబలి సినిమా తో నేషనల్ వైడ్ క్రేజ్ ని సంపాదించుకున ప్రభాస్ ఇప్పుడు బాలీవుడ్ లో అడుగుపెడుతునట్టు సమాచారం.
బాహుబలి లో బాహుబలి, శివుడు పాత్రా లతో అదరగొట్టిన ప్రభాస్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని ఒక ఉపూ ఊపాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 600 కోట్ల పైన కొల్లగొట్టింది. ఇండియా లో అత్యదిక వసూళ్ళు సాదించిన సినిమాలలో బాలీవుడ్ సినిమాలను సైతం వెనక్కినెట్టి మొదటి స్థానాన్ని ఆక్రమించింది. బాలీవుడ్ "ఖాన్" ల పాపులారిటీ ని తలదన్నే క్రేజ్ ని సంపాదించుకునాడు ప్రభాస్.
ఐతే ప్రస్తుత సమాచారం ప్రకారం ప్రభాస్ కి బాలీవుడ్ లో ఒక క్రేజి ఆఫర్ వచ్చింది. ప్రముఖ యష్ రాజ్ సంస్థ నిర్మించే "ధూమ్" సిరీస్ 4 వ భాగం లో విలన్ రోల్ లో ప్రభాస్ ని నటింపచేయాలని అనుకుంటున్నారట యష్ రాజ్ ఆదిత్య చోప్రా. ఇంతక ముందు ఈ రోల్ లో హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ లు నటించారు. ఇప్పుడు ప్రభాస్ ఈ రోల్ చేస్తే అది ప్రభాస్కే కాదు తెలుగు సినిమా కి గర్వ కారణం కుడా.

0 comments:
Post a Comment